హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS RTC: ప్రయాణికులకు షాక్..టీ24 టికెట్‌ రేటు పెంచిన ఆర్టీసీ ఎంతంటే

TS RTC: ప్రయాణికులకు షాక్..టీ24 టికెట్‌ రేటు పెంచిన ఆర్టీసీ ఎంతంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS RTC:టీఎస్‌ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచింది. 24గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్‌ ధరపై 20పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా..శుక్రవారం నుంచి వసూలు చేస్తోంది.

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TS RTC) సైలెంట్‌గా ఛార్జీలను పెంచుతూ ప్రయాణికులకు షాక్ ఇస్తోంది. పరీక్షల సమయంలో విద్యార్ధులకు ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్(Free transport)అని ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ..డే పాస్‌ టికెట్(Day pass‌ ticket)ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)సిటీలో 24గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సౌకర్యం కలిగిన ట్రావెల్ యాజ్ యువర్ లైక్ టికెట్‌(Travel as Your Like Ticket)‌(TAYL) ధరను 20రూపాయలకు పెంచింది. గతంలో ఈ టికెట్ ధర 100రూపాయలు ఉండగా...ఇప్పుడు 120రూపాయలకు పెంచుతూ టీఎస్‌ ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంచిన టికెట్ ధరలను శుక్రవారం(Friday) నుంచి అమల్లోకి తెచ్చింది ఆర్టీసీ. గతంలో టీ24 టికెట్‌ రేట్‌ని పలు సందర్బాల్లో 20శాతం డిస్కౌంట్ (Discount)ఇచ్చారు. అప్పుడు మంచి ఆదరణ లభించింది. డిస్కౌంట్ రద్దు చేసిన తర్వాత కూడా ట్రావెల్ యాజ్‌ యు లైక్ టికెట్‌కు ఆదరణ తగ్గలేదు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు ఆర్టీసీ అధికారులు.

టీఎస్‌ ఆర్టీసీ బాదుడు..

డీజిల్ ధరల పెరగడంతో..ఛార్జీలు పెంచాలని టీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తాజాగా సాధారణ టికెట్‌ ధరలతో పాటు పాస్‌ల ధరల్ని పెంచింది. వాటిని పెంచిన క్రమంలోనే ఇప్పుడు టీ24 టికెట్ ధరను కూడ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇచ్చారు.

డే టికెట్‌పై 20రూపాయలు పెంపు..

ప్రజారవాణా సౌకర్యం కోసం విస్తృత సేవలు అందిస్తామని ప్రకటించింది టీఎస్‌ఆర్టీసీ. అందులో భాగంగానే ప్రత్యేక సర్వీసులు, స్టూడెంట్స్, మదర్స్ డే, విమెన్స్‌ డే, పండగలకు, ప్రత్యేక దినాల్లో ఆయా వర్గాల ప్రయాణికులకు టికెట్‌లో రాయితీ, ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తూ వస్తోంది. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌ కంటే ఆర్టీసీ సర్వీసులు బెటర్ అని జనం ఫీలవుతున్న క్రమంలోనే నిదానంగా ఒక్కో టికెట్‌ ధరలను పెంచుకుంటూ వస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీఎస్‌ఆర్టీసీ ఈవిధంగా టికెట్‌ ఛార్జీలు పెంచుకుంటూ పోతే ప్రజలు నిదానంగా ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వైపు చూడాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం కూడా ఉంది.

లాభాలు పెంచే దిశగా..

టీఎస్‌ఆర్టీసీ సంస్థ పాత బస్సులతోనే సర్వీసులు అందిస్తోంది. కార్గొ సర్వీస్‌ ద్వారా వస్తువుల రవాణా చేస్తూ కొంతలో కొంత ఆదాయం పొందుతోంది.వీటితో పాటు గ్రేటర్‌లో ఆక్యుపెన్సీ పెంచడంతో పాటు రాత్రివేళల వరకు అన్నీ మార్గాల్లో బస్సులు తిప్పుతూ ఆదాయం పొందాలని చూస్తోంది. ఓవైపు ఆటో, క్యాబ్స్, మరోవైపు మెట్రో, ఎంఎంటీఎస్‌ సర్వీసులు పోటీ ఇస్తున్నా..తట్టుకొని ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది టీఎస్‌ ఆర్టీసీ.

First published:

Tags: Greater hyderabad, Telangana, Tsrtc

ఉత్తమ కథలు