Home /News /telangana /

HYDERABAD TSRTC EMPLOYEES SALARY DEPOSIT BANK ACCOUNTS ON EVERY MONNTH 1ST DETAILS HERE VB

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎండీ సజ్జనార్‌ కీలక నిర్ణయం.. ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు అందనున్నాయి. ఇన్నాళ్లు పది, పదిహేను రోజులు ఆలస్యంగా వేతనాలు ఇవ్వగా ఒకటో తేదీనే చెల్లించేలా సంస్థ ఎండీ సజ్జనార్‌ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ నెలకు సంబంధించి నేడు ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకానున్నాయి.

ఇంకా చదవండి ...
    వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ(RTC)లో ఎండీగా నియామకం అయిన దగ్గర నుంచి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీని లాభాల బాట నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో ఉండే సమస్యకు పరిష్కారం చూపారు. ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు అందనున్నాయి. ఇన్నాళ్లు పది, పదిహేను రోజులు ఆలస్యంగా వేతనాలు ఇవ్వగా ఒకటో తేదీనే చెల్లించేలా సంస్థ ఎండీ సజ్జనార్‌ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ నెలకు సంబంధించి నేడు ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకానున్నాయి. అయితే వాస్తవానికి 2018 డిసెంబర్‌ వరకు ఆర్టీసీ ఉద్యోగులు/కార్మికులు ప్రతినెలా ఒకటో తేదీకి అటూఇటుగా వేతనాలు తీసుకునేవారు. కానీ రాను.. రాను మరింత దారుణంగా మారిందని ఆ సంస్థ ఉద్యోగులు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


    కొత్తగా ఇంట్లో పని మనిషిగా చేరింది.. గ్రౌండ్‌ ఫ్లోర్‌ శుభ్రం చేస్తుండగా వంట మనిషి చూశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


    వారి సమస్యలకు తోడు కోవిడ్ వ్యాప్తి, లాక్‌డౌన్ సమస్యలు వచ్చ పడటంతో సంస్థకు ఆర్ధిక భారం మరింత పెరిగిపోయింది. ఈ సమస్యలపై బ్యాంకులతో చర్చలు జరిపారు. ప్రతినెలా ఒకటో తేదీలోపు రూ.100 కోట్ల ఓవర్‌డ్రాఫ్టు ఇవ్వాలని.. డిపోల్లో రోజువారీ టికెట్‌ కలెక్షన్‌ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని ప్రతిపాదించారు. దీనికి ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ముందుకొచ్చి.. అక్టోబర్‌ ఒకటిన జీతాల చెల్లింపు కోసం రూ.100 కోట్లు అందించింది. టికెట్ల ఆదాయం నుంచిగానీ, ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచిగానీ తిరిగి ఈ సొమ్మును బ్యాంకుకు చెల్లించనున్నారు.  సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల జీతాల విషయంపై ఆయన మొదట దృష్టిపెట్టారు. దీనిపై ఉన్నత అధికారులతో, బ్యాంక్ అధికారులతో చర్చించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.


    Bhadrari Kothagudem: భద్రాద్రిలో అపచారం.. రాముని ప్రసాదంగా వర్ధంతి భోజనం.. అసలేం జరిగిందంటే..


    అతడి నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతీ ఒక్కరినీ మెప్పిస్తున్నాయి. ఇటీవల ఓ సినిమా పోస్టర్ బస్సుపై అశ్లీలంగా కనిపించటంతో ఓ యువకుడు దానిని ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. యువకుడి ట్విట్ కు స్పందించిన ఎండీ సజ్జనార్ రీ ట్వీట్ చేశారు. బస్సులపై అశ్లీల చిత్రాల ఫోటోలు ఇకపై కనిపించవని, అలాంటి నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక వెంటనే ఆర్టీసీ బస్సులపై అభ్యంతరకరమైన ఫోటోలు తొలగించాలని అధికారులకు ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారి చేయడంతో అధికారులు వాటిని తొలగించే పనిలో ఉన్నారు.

    ఆర్టీసీ ఉద్యోగుల జీతాలపై సజ్జనార్ ఇలా ట్వీట్ చేశారు. మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు. ఆర్టీసీ సంస్థ ఒక సంస్థ మాత్రమే కాదు ఒక కుటుంబం మనమంతా దానిలో సభ్యులం. మన కుటుంబం మన ఆర్టీసీ మన సంస్థ కలిసికట్టుగా కష్టపడతాం దాని అభివృద్ధికి మన వంతు సహాయం చేద్దాం అంటూ ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Veera Babu
    First published:

    Tags: Sajjanar, Tsrtc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు