హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC Chairman : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కీలక నిర్ణయం ...

TSRTC Chairman : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కీలక నిర్ణయం ...

TSRTC

TSRTC

TSRTC Chairman : ఆర్టీసీకి తీరిగి పునర్వైభవం తీసుకురావడానికి ఓ వైపు కార్మికులతో పాటు ఎండీ సజ్జనార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా తన వంతు భాద్యతగా చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ( TSRTC Chairman Bajireddy govardhan takes key decision ) ఆయనకు చైర్మన్‌గా ఎలాంటీ జీతభత్యాలు అవసరం లేదని చెప్పారు.

ఇంకా చదవండి ...

టీఎస్ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ కీలకనిర్ణయం తీసుకున్నారు.( TSRTC Chairman Bajireddy govardhan takes key decision ) ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని ప్రకటించారు. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వకంగా అధికారులకు రాసి ఇచ్చారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున సంస్థపై అదనపు ఆర్థికభారం మోపడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. శాసనసభ్యుడిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలు అని బాజిరెడ్డి పేర్కొన్నారు. (TSRTC Chairman Bajireddy govardhan takes key decision )

కాగా చైర్మన్‌ నిర్ణయంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ పున్న హరికిషన్‌ బాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్‌ ను స్ఫూర్తిగా తీసుకొని ఆర్టీసీ అధికారులు కూడా అలవెన్స్‌ల విషయంలో కొన్ని త్యాగాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఇది వరకే ఆర్టీసీ ( tsrtc )ఉన్నతాధికారుల జీతాల విషయంలో కూడా కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. కార్మికుల లేని జీతాలు ఉన్నతాధికారులు ఉండడం కూడా సంస్థకు భారంగా పరిణమించాయనే ఆందోళన కార్మికుల్లో మొదలైంది. దీంతో చైర్మన్‌గా బాజిరెడ్డి (Bajireddy govrdan )తీసుకున్న నిర్ణయం సంస్థలోని ఉద్యోగులకు స్పూర్తినివ్వడంతో పాటు సంస్థ అభివృద్దికి కట్టుబడి ఉన్నామనే సంకేతాలను కూడా కార్మికుల్లో వెళ్లే అవకాశాలు ఉండడంతో పాటు వారు కూడా మరింత భాద్యతాయుతంగా తమ విధుల్ని నిర్వహించేందుకు అవకాశాలు ఉంటాయి.

 ఇది చదవండి : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా .. ఇటివలే మనవరాలి పెళ్లి.. హాజరైన ఇద్దరు సీఎంలు


కాగా ఆర్టీసీ ఇప్పిడిప్పుడే గాడిన పడుతోంది. కరోనా మహ్మమ్మారి నుండి ప్రజలు ఇఫ్పుడిప్పుడే కోలుకోవడంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సి రేటు కూడా పెరుగుతొంది. దీంతో గతంలో ఎప్పుడు లేనట్టుగా ఒక్కరోజులోనే సుమారు 14 కోట్ల రూపాయల ఆదాయాన్ని ( income ) అర్జించి రికార్డు సాధించింది.


ఇది ఇలా ఉండగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ( rtc md vc sajjanar )సైతం కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల భద్రతతో పాటు ప్రయాణికులకు ఆర్టీసీని దగ్గర చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు చేపట్టడడం, బస్సులు లేని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రయాణికులు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యను పరిష్కరించడంతో పాటు సంస్థపరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన దృష్టి సారించారు. దీంతో ఆర్టీసీ నష్టాల ఊబినుండి బయటపడేందుకు ఊపిరూలుదుకుంటుందని భావిస్తున్నారు.ముఖ్యంగా డిజిల్ రేట్లు పెరగడం ఆర్టీసీపై భారం పడడం లాంటీ వాటితో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోవాలనే యోచన కూడా చేసి వాటికి ఆర్డర్స్ సైతం ఇచ్చింది. దీంతో రానున్న రోజుల్లో డిజిల్ భారం నుండి బయట పడి అభివృద్ది దిశగా అడుగులు వేసేందుకు అధికారులతో పాటు కార్మికులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Rtc, Tsrtc

ఉత్తమ కథలు