హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: పెళ్లిళ్ల సీజన్‌... టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..!

TSRTC: పెళ్లిళ్ల సీజన్‌... టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..!

TSRTC: పెళ్లిళ్ల  సీజన్‌లో టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..!

TSRTC: పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..!

తాజాగా పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో డిమాండ్‌ దృష్ట్యా.. 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు ఆ రాయితీని సంస్థ ప్రకటించింది. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్‌ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Telangana

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల చేసుకునే వారి కోసం... తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక తగ్గింపును అందజేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తామని ఆర్టీసీ తెలిపింది

కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో ఆర్టీసీ సంస్థ కల్పించింది.తాజాగా తెలంగాణలో పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు TSRTC ట్వీట్ చేసింది, “#TSRTC పెళ్లిళ్ల సీజన్ సందర్భంలో కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు అద్దెపై ప్రత్యేక తగ్గింపును అందజేస్తున్నారు. అన్ని రకాల బస్సు సర్వీసులపై 10 శాతం తగ్గింపు. అద్దె బస్సులపై ఈ ఏడాది జూన్ 30 వరకు 10 శాతం తగ్గింపు అమలులో ఉంటుంది.

గత ఏడాది డిసెంబర్‌ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో డిమాండ్‌ దృష్ట్యా.. 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు ఆ రాయితీని సంస్థ ప్రకటించింది. శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు.

ప్రైవేట్‌ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తోందని వారు పేర్కొన్నారు. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్‌ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు. మరిన్ని వివరాల కోసం, ప్రయాణీకులు 040- 69440000 లేదా 040- 23450033 నంబర్‌లను సంప్రదించవచ్చు. TSRTC వెబ్‌సైట్‌లో టిక్కెట్‌లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు . అద్దె బస్సుల బుకింగ్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు.

First published:

Tags: Local News, RTC buses, Tsrtc