హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS RTC GIFT: మదర్స్‌ డే నాడు అమ్మలందరికి బస్సుల్లో ప్రయాణం ఉచితం..వాళ్లకు మాత్రం కాదు సుమా

TS RTC GIFT: మదర్స్‌ డే నాడు అమ్మలందరికి బస్సుల్లో ప్రయాణం ఉచితం..వాళ్లకు మాత్రం కాదు సుమా

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Ts rtc gift:మదర్స్‌ డే సందర్భంగా మాతృమూర్తులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మరో అవకాశాన్ని కల్పిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లులు మే 8వ తేదిన అన్నీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. ఈ అవకాశాన్ని మాతృమూర్తులు ఉపయోగించాలని పిలుపునిచ్చింది.

ఇంకా చదవండి ...

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(tsrtc) మాతృమూర్తులకు గొప్ప సదావకాశాన్ని కల్పిస్తోంది. మాతృదినోత్సవం (Mother's Day)సందర్భంగా ఈనెల 8వ తేదిన ఆదివారం (Sunday)బిడ్డలతో వెళ్లే తల్లులకు రాష్ట్రంలోని అన్నీ బస్సు సర్వీసులకు ఉచితంగా ప్రయాణించే (Free transport)అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులకే ఈ అవకాశం వర్తిస్తుందని ప్రకటించింది. మదర్స్‌ డే కానుకగా అన్ని సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ యాజ‌మాన్యం మ‌ద‌ర్శ్ డే శుభాకాంక్ష‌లు తెలుపుతూ మాతృమూర్తులు ఈ స‌దావకాశాన్ని వినియోగించుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌(Bajireddy Govardhan), ఎం.ఎల్‌.ఎ , వైస్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ వి.సి.స‌జ్జ‌నార్‌(VC Sajjanar), ఐ.పి.ఎస్ మాట్లాడుతూ తన త్యాగపు పునాదులపై.. మన జీవిత‌ సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తుల సేవ‌లు విశిష్ట‌మైన‌వ‌ని కొనియాడారు. అలాంటి వారికి ఇలాంటి అవకాశం కల్పించడం ఆర్టీసీ సంస్థ గొప్పగా భావిస్తుందని పేర్కొన్నారు.

మాతృమూర్తులకు కానుక..

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సామాజిక దృక్ఫ‌థంతోను అడుగు ముందుకేస్తోంద‌ని, ఇలాంటి ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో ప్ర‌త్యేక రాయితీలు కూడా క‌ల్పిస్తున్న వైనాన్ని ఆర్టీసీ అధికారులు గుర్తు చేశారు. ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డేతో పాటు నిరుద్యోగ యువతకు సైతం ఛార్జీలో రాయితీ ప్రకటించింది టీఎస్‌ ఆర్టీసీ. అమ్మ అనురాగాన్ని, ప్రేమ‌ను వెల‌క‌ట్ట‌లేమంటూ ఆ త్యాగ‌మూర్తి సేవ‌ల‌ను గుర్తించుకుని మ‌ద‌ర్శ్ డే ని పుర‌స్క‌రించుకుని వారికి ప్ర‌త్యేకంగా ఉచిత ప్ర‌యాణ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని ప్రకటించింది.

ఉచిత ప్రయాణం..

మాతృదినోత్సవం రోజున తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదావకాశం పట్ల మహిళలు, మాతృమూర్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నష్టల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడంతో పాటు ప్రజలకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సేవలను మరింత చేరువ చేయడానికి ఈతరహా రాయితీలు, ఉచిత స్కీమ్‌లు ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలు పొందుతోంది.

First published:

Tags: Mother's day special, Sajjanar, Tsrtc

ఉత్తమ కథలు