TSPSC : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు ఆల్రెడీ గంగలో కలిసిపోయింది. ఆ సంస్థపై కాస్తో, కూస్తో ఉన్న నమ్మకం కూడా పోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. మొత్తం 15 పేపర్లు లీక్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై జరుగుతున్న దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు తెలుస్తున్నాయి.
గ్రూప్ 1, AE, AEE, JL, టౌన్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ విభాగాల్లో మొత్తం 15 పేపర్లు లీక్ అయినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో ఈ 6 విభాగాల పోస్టులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను సిట్ అధికారులు గుర్తించారు. ఈ పేపర్లు లీక్ అవ్వడమే కాదు.. ఆల్రెడీ జరిగిపోయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించిన మెయిన్స్ పరీక్షల పేపర్ల కోసం కూడా బేరసారాలు జరిగినట్లు దర్యాప్తులో తెలిసింది. ఐతే.. మెయిన్స్ పేపర్లు లీక్ అవ్వకముందే.. ఈ స్కామ్ బయటపడింది.
దీన్ని బట్టీ చూస్తే.. TSPSCలో ప్రశ్నాపత్రాలకు అసలు సెక్యూరిటీయే లేదని అనుకోవచ్చనిపిస్తోంది. రోడ్డు పక్కన పకోడీ, బజ్జీల మాదిరిగా.. ప్రశ్నాపత్రాలను ఇష్టమొచ్చినట్లు లీక్ చేసి అమ్ముకున్నట్లు అర్థమవుతోంది. ఇలా అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమేంటని అంతా ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Paper leak, TSPSC