హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSPSC: పేపర్ లీకేజీపై రాజకీయ రచ్చ.. కేసీఆర్ టార్గెట్‌గా ఈటల ఫైర్! సిట్టింగ్‌ జడ్జితో విచార

TSPSC: పేపర్ లీకేజీపై రాజకీయ రచ్చ.. కేసీఆర్ టార్గెట్‌గా ఈటల ఫైర్! సిట్టింగ్‌ జడ్జితో విచార

X
etela

etela

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ దొంగలకు, బ్రోకర్లకు నిలయంగా మారిందని.. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీపై పూర్తి నమ్మకం పోయిందని విమర్శించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(దస్తగిరి, న్యూస్‌-18 తెలుగు, రిపోర్టర్)

ప్రశ్నపత్రాల లీకేజీపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలని ఈటల డిమాండ్ చేశారు. చంచల్ గూడ జైల్లో ఉన్న BJYM నాయకులను పరామర్శించిన ఈటల రాజేందర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ దొంగలకు, బ్రోకర్లకు నిలయంగా మారిందని.. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీపై పూర్తి నమ్మకం పోయిందని విమర్శించారు.

టార్గెట్‌ కేసీఆర్‌:

సీఎం కేసీఆర్ పై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ మూడు తరాల ఉద్యమ చేసిందని తెలిపారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో చార్మినార్ వద్ద ఆనాటి విద్యార్థులపై తూటాలు పేల్చితే ఏడుగురు విద్యార్థులు మరణించారని ఆయన వివరించారు. ఏపీ పాలకుల విముక్తి కోసం.. నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో ఉద్యమించామని.. తెలంగాణ వచ్చాక లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారని.. అవన్నీ ఇప్పటి వరకు భర్తీ చేయలేదని గుర్తు చేశారు. ఆనాడు ఏ ఉద్యోగాలొస్తాయని సంబురపడ్డమో.. వాటి సంగతి అటుంచితే ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు.. ఆర్టీసీ కార్మికులు.. సింగరేణి కార్మికుల మృతికి ప్రభుత్వం కారణమైందన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ వాటిని రద్దు చేయకపోగా.. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే నియమించారు. చివరకు టీఎస్పీఎస్సీలో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా? అని ప్రశ్నించారు.

గత 4 ఏళ్లలో 11 వేల కు మించి ఉద్యోగాలను కూడా భర్తీ చేయని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చదువుకున్న పిల్లలంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారనే భయంతో ఎన్నికల ఏడాది వస్తున్నందున వాళ్లంతా కోచింగ్ సెంటర్లలో బిజీగా ఉండాలని నోటిఫికేషన్లు ప్రకటించారే తప్ప వాళ్లపై ప్రేమతో కాదన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు రేవంత్‌ రెడ్డి నుంచి విమర్శల దాడి:

TSPSC పేపర్ లీకేజీ కేసు విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉన్న కొంతమందిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐ, ఈడీ, ఏసీబీతో కలిసి సిట్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూపై ఫిర్యాదు చేసేందుకు గత రెండు, మూడు రోజులు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల అపాయింట్ మెంట్ అడిగినా.. తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వాలని మీడియా ద్వారా కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీ కుంభకోణం, ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఇతర దేశాల్లోనూ మూలాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

First published:

Tags: CM KCR, Etela rajender

ఉత్తమ కథలు