HYDERABAD TS RTC WILL RUN 116 ELECTRIC BUSES IN FOUR DISTRICTS OF TELANGANA SNR
Telangana: 4జిల్లాల్లో ఆర్టీసీ ఎలక్ట్రీక్ బస్సులు..పైలెట్ ప్రాజెక్ట్ కింద 116బస్సులు
(ప్రతీకాత్మకచిత్రం)
TSRTC: మొన్నటి వరకు నష్టల్లోంచి బయటపడాలన్నదే టీఎస్ ఆర్టీసీ లక్ష్యం. నిన్న వరకు సంస్థను లాభాల బాటలో పరుగులు పెట్టించాలి ఆదాయం పెంచుకోవాలన్న ఆలోచన. ఇప్పుడు ఖర్చు తగ్గించుకోవాలన్న ముందుచూపు. అందుకోసం ఏం చేస్తుందో తెలుసా
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను లాభాల పట్టించేందుకు సంస్థ నిర్వాహకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రగతిరథ చక్రాలను పరుగులు పెట్టిస్తూ సంస్థకు ఆదాయం పెరిగేలా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని జిల్లాల్లో నూతన ఎలక్ట్రిక్ బస్సుల(Electric buses)ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని చూస్తోంది సంస్థ యాజమన్యం. తొలి ప్రయత్నంలో భాగంగా 116ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నాలుగు జిల్లా(Four districts)ల్లో ప్రయోగాత్మకంగా వాటిని ఉపయోగించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ(TSRTC MD) సజ్జనార్(Sajjanar) భావించారు. ముందుగా పైలెట్ ప్రాజెక్ట్(Pilot Project) కింద ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్(Karimnagar), నల్లగొండ(Nallagonda), వరంగల్(Warangal), మహబూబ్‌నగర్(Mahabubnagar)జిల్లాల్లో తిప్పనున్నారు. రాష్ట్రంలోని చాలా డిపోల్లో కాలం చెల్లిన పాత బస్సులు ఉన్నాయి. వాటితోనే ప్రజారవాణా కల్పిస్తున్నారు. మరోవైపు డీజిల్(Diesel)ధర భారీగా పెరడంతో పాత బడిన బస్సుల్లో మైలేజీ రావడం లేదు. దీంతో ఆర్టీసీకి భారంగా మారిన బస్సుల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేసే యోచనలో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను వాడితే ప్రయోజనం ఎంత మేరకు ఉంటుంది. సంస్థకు ఏమేరకు ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు.
ఆ విధంగా ముందుకు..
మరోవైపు ఆర్టీసీకి ఆదాయం పెంచే మార్గంలో భాగంగానే శ్రీరామనవమికి తలంబ్రాలను భక్తులకు తమ కార్గో సర్వీస్ ద్వారా డోర్ డెలవరీ చేశారు. ఇప్పుడు మామిడి పండ్లను అదే విధంగా ఆర్డర్‌పై బుక్ చేసుకున్న వినియోగదారుల ఇంటికి తీసుకెళ్లి మరీ ఇస్తోంది తెలంగాణ రోడ్డు రవాణాసంస్థ. ఈవిధంగా ఆదాయం ఏ రూపంలో సమకూరుతుందో అనే ఆలోచనతోనే తెలంగాణ రోడ్డు రవాణాసంస్థ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి నిర్ణయాలు, నూతన ప్రయోగాల ద్వారా టీఎస్ఆర్టీసీకి వంద కోట్లాది రూాపాయల లాభం వచ్చిందని స్వయంగా ఎండీ సజ్జనార్ తెలిపారు. భవిష్యత్తులో వేర్వేరు సౌకర్యాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఆర్టీసీని సిరుల పంట పండించే సంస్థగా మార్చేస్తామన్నారు.
ఆదాయం పెంచే ఆలోచన..
గురువారం వేములవాడ రాజన్నను దర్శించుకున్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్..త్వరలోనే ఆర్టీసీ బస్ ఎక్కడుందో కనుగొనేందుకు ఓ యాప్‌ని రూపొందిస్తామన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే వేములవాడ రాజన్న ప్రసాదాన్ని సైతం భక్తులకు అందజేసే ప్లాన్ వేస్తున్నామన్నారు. కార్మికులకు ఫస్ట్ తారీఖునే జీతాలు ఇస్తున్నామని, ఇటీవలే డీఏ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ. రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసుల్ని నడిపే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.