తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TS RTC)పై ప్రజలకు నమ్మకం కలిగించడమే కాదు..ట్రాన్స్‌పోర్ట్(Transport)సేవలను మరింత చేరువ చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తోంది. అందుకే గతంలో కంటే భిన్నంగా టీఎస్‌ఆర్టీసీ ప్రజలకు అనుకూలంగా ఉండేలా ..ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ (Private Transport)సర్వీసులను తలదన్నే విధంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తోంది. అందులో ప్రధానమైనది కార్గో సర్వీస్(Cargo Service)లు. నిన్న, మొన్నటి వరకు ఏదైనా వస్తువులు పార్సిల్ పంపాలన్నా ..పార్సిల్(Parcel)తీసుకోవాలన్నా ఆర్టీసీ బస్ డిపోలు, బస్టాండ్‌లలోని కార్గో పాయింట్స్‌కి తీసుకెళ్లాల్సి ఉండేది. కాని ఇప్పుడు అలాంటి ఇబ్బందు లేకుండా డోర్ డెలవరీ(Door delivery)చేయాలని నిర్ణయించింది.
మాతో చేతులు కలపండి..
ఇందుకోసం అన్నీ జిల్లాల్లో కార్గో హోమ్ డెలవరీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్(Bajireddy Govardan)ఎండీ సజ్జనార్(Sajjanar)ప్రకటించారు. వినియోగదారుల ఇంటి దగ్గరకే పార్శిల్ సేవలు అందించే దిశలో ప్రతిపాదనల్ని రూపొందించినట్లు తెలిపారు. ఆర్టీసీతో చేతులు కలిపేందుకు ఆసక్తి ఉన్న ఏ సంస్థలైనా ముందుకు రావొచ్చని ఆహ్వానించారు. అంతే కాదు ఈనెల 27వ తేదిలోగా వారి బిజినెస్ వివరాలను 9154197752 నెంబర్‌కి కాల్ చేసి సూచించాలని పిలుపునిచ్చారు. అలాగే splofficertc@gmail.comకు పంపాలన్నారు.
#TSRTCCargoParcel services soon at your doorstep!
Home pick up & delivery services available shortly all over #Telangana State! @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @TV9TeluguLive @sakshinews @eenadulivenews @IPRTelangana @NewsmeterTelugu @madhuparna_N @Kurmanath @dennismarcus pic.twitter.com/USF4ydXNIa
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 25, 2022
సేవలు విస్తృతం..
ఇదే కాదు సిటీలో బస్ ఛార్జీలు పెంచినప్పటికి పుష్పక్ ఏసీ బస్సుల్లో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్‌ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో లాంగ్ జర్నీ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే గంటలోగా సిటీ బస్‌లో ఫ్రీగా జర్నీ చేసే సౌకర్యం కల్పించినట్లే ఇప్పుడు పుష్పక్ బస్‌లో ప్రయాణం చేసిన వాళ్లు తమ నివాస ప్రయాణానికి చేరుకునేందుకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే పుష్పక్ టికెట్ తీసుకున్న సమయం నుంచి మూడు గంటల వరకు మాత్రమే ఆ టికెట్ చూపించి సిటీలో ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఈడీ తెలిపారు.
పార్శిల్ డోర్ డెలవరీ సౌకర్యం..
ఆర్టీసీకి ఆదాయం పెంచే ఆలోచనలతో పాటు ప్రయాణికుల ఆరోగ్యం, ఆనందంపై కూడా టీఎస్‌ఆర్టీసీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ రోడ్డు రవాణాసంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హాని తలపెట్టే పొగాకు ఉత్పత్తులైనటువంటి తంబాకు, గుట్కా, ఖైని వంటి వాటిని ఏ బస్టాండ్‌లలో విక్రయించడానికి వీల్లేదని గతంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రావాణాశాఖ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. అయితే ఆదేశాలను ఇకపై పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని మరోసారి ఆర్టీసీలోని ఉన్నతాధికారులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cargo service, Sajjanar, Tsrtc