TS cabinet meeting : రాష్ట్ర కేబినెట్ మీటింగ్...దళిత బంధు ప్రధాన ఎజెండా...! ఉద్యోగాలు కూడా కొలిక్కి వస్తాయా..?

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

TS cabinet meeting :ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుండగా ఆగస్టులో ప్రారంభించనున్న దళితబంధు ప్రధాన ఎజెండాగా సమావేశం కొనసాగనుంది.

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. అయితే ఈ
    సమావేశంలో ప్రధాన ఎజెండాగా దళిత బంధు అమలు పై చర్చించనున్నారు.ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు మంత్రివర్గం అమోద ముద్ర వేయనుంది. దీంతో పాటు ఇతర అంశాలైన,క‌ృష్ణా గోదావరి నదులపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ , భవిష్యత్ కార్యచరణ తోపాటు ఇదివరకే 50 వేల ఉద్యోగాలపై చర్చించిన ప్రభుత్వం మరోసారి ఆ అంశాలపై చర్చించనున్నారు. కాగా ఖాలీల సంఖ్యను తేల్చాలని అధికారులకు గడువు ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పటికే పదిహేను రోజులు పూర్తయింది.. దీంతో మరోసారి ఉద్యోగ ఖాలీలపై పూర్తి కసరత్తు జరగనున్నట్టు సమాచారం.

    ముఖ్యంగా దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో కొనసాగించాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది కోర్టుకు కూడా వెళ్లిన నేపథ్యంలోనే ఇతర మంత్రుల అభిప్రాయాలు తీసుకుని దానికి అమోద ముద్ర వేయనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేశారు. వంద శాతం ఎన్ని అడ్డంకులు వచ్చిన దళిత బంధు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో వస్తున్న డిమాండ్లపై మంత్రులతో చర్చించి ముందుగా హుజూరాబాద్‌లో దళిత బంధును కొనసాగించనున్నారు.

    కాగా జులైలో రెండు సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. జూలై 6న మంత్రి వర్గం సమావేశం కాగా..జూలై 13న కొనసాగిన సమావేశం సుదీర్గంగా రెండు రోజుల పాటు కొనసాగింది.ఇంత తక్కువ సమయంలో మూడు సార్లు కేబినెట్ భేటి కానుండడంతో రేపటి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
    Published by:yveerash yveerash
    First published: