TRS Party Meeting: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ముగిసిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

TRS Party Meeting: టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) తరఫున 5 సెట్ల నామినేషన్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాఖలు చేశారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నేడు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. దీనిపై కేసీఆర్ ఏం చర్చించారంటే..

 • Share this:
  టీఆర్‌ఎస్‌(TRS) అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) తరఫున 5 సెట్ల నామినేషన్లు(Nominations) మంత్రులు(Ministers), ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాఖలు చేశారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనున్న విషయం తెలిసిందే. దీనిలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, అజయ కుమార్ నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది.

  ఉప ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ కు ప్లస్ చేకూరింది.. ఈ సారి జాగ్రత్త పడకపోతే వారు ఓడిపోవడం పక్కా..! ఎందుకంటే..


  ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ సభ్యులు, నేతల ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుజరాబాద్‌లో సభ నిర్వహించడానికి సమావేశంలో నిర్ణయించారు. హుజురాబాద్‌లో విజయం మనదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. నవంబర్ 15న వరంగల్‌ ప్రజాగర్జన సభను నిర్వహించాలన్నారు.

  Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


  ఇక నుంచి ప్రతీ రోజు 20 నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించాలన్నారు. అంతే కాకుండా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లడం లేదని ప్రకటించారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఇంకా రెండేళ్లు ఉంది. అన్ని పనులు చేసుకుందామని కేసీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్‌లో ప్రజాగర్జన సభ నిర్వహించాలని సీఎం సూచించారు. వరంగల్‌ సభపై కేటీఆర్‌ అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

  ఈటెలకు అది కలిసిరానుందా.. ధర్మం అధర్మానికి మధ్య నడుస్తున్న యుద్ధం లో ఎన్నికల గెలుపు ఎవరిది..?


  ఇక ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో సమావేశం నిర్వహించగా.. సాయంత్రం 5.45 కి ముగిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, హెచ్‌ఐసీసీలో అక్టోబర్ 25వ తేదీన నిర్వహించనున్న ప్లీనరీ, అలాగే, వచ్చే నెల 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇదిలా ఉండగా.. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

  ఈనెల 23న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన.. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 25 హైటెక్స్‌లో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. నేటి నుంచి 22 తేదీవరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లు స్వీకరించునున్నారు.
  Published by:Veera Babu
  First published: