Home /News /telangana /

HYDERABAD TRS WORKING PRESIDENT KTR FIRES ON BJP NATIONAL PRESIDENT JP NADDA VRY

KTR on JP Nadda : జేపీ నడ్డాకు మెంటలే.. ఆయన ఓ అబద్దాల అడ్డా.. మిగిలింది.. ఎర్రగడ్డే...

కేటీఆర్​ (ఫైల్​)

కేటీఆర్​ (ఫైల్​)

KTR : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యాఖ్యలు చేయడంపై సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. ఆయన్ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి పంపడం ఖాయామని అన్నారు.

ఇంకా చదవండి ...
    కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌కు ఏటిఎంగా మారిందన్న జేపీ నడ్డా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. సీఎం కేసీఆర్ రైతులకు ఏటిఎం లాంటివాడని అన్నారు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పాలన రాజ్యమేలుతుంటే.. సిగ్గు, లజ్జా లేకుండా తెలంగాణ ప్రభుత్వంపై అరోపణలు చేయడం పై మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివ‌ృద్ది చేసిన కార్యక్రమాలను ఇతర మంత్రులు ప్రశంసలు కురిపిస్తుంటే మీరు మమ్మల్ని విమర్శంచడంపై నడ్డాకు మతి లేదని దుయ్యబట్టారు..

    ఒక దేశ ప్రధానిని ఆడ్డుకున్న చరిత్ర ఎప్పుడు లేదని మండిపడ్డారు. ఆ పరిస్థితి తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వమని అని మండిపడ్డారు.. మోదీ విధానాలకు వ్యతిరేకంగా అక్కడి రైతులు సుమారు అర్థగంట ప్రధానిని అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు.. మరోవైపు యూపీలో రైతులను రోడ్డుపై తొక్కించి చంపించిన ఘటన బీజేపీదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు , మీ దిక్కుమాలిన పాలన నినాదాలుగా మారాయని అన్నారు. ఇక కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను కేంద్రం అమలు చేస్తూ మమ్మల్లే విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు.. తెలంగాణ ప్రభుత్వం మీద కుట్రలు చేస్తే నడవని హెచ్చరించారు.. కాళేశ్వరం విషయంలో మత్రి నడ్డాకే మతి పోయిందని అన్నారు. కేంద్ర జల శక్తి మంత్రి ఓవైపు కాలేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తుంటే మీరు విమర్శిస్తూంటే ఎవరికి మెంటల్ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కనీసం ఒక్కరూపాయి కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని విమర్శిస్తారా అంటూ దుయ్యబట్టారు.. తెలంగాణకు నడ్డా సొంత రాష్ట్రం బీహారుతో పాటు యూపీ ఇతర రాష్ట్రాల నుండి కూడా తెలంగాణకు బతుకు దెరువు కోసం వస్తున్నారని అన్నారు.

    Earthquake : హైదారాబాద్ శివారులో పలు చోట్ల భూకంపం.. బయటకు పరుగులు తీసిన స్కూలు విద్యార్థులు


    కేంద్రం ఓవైపు కరోనా నిబంధనలు అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ నేతలు ఉల్లంఘించడంపై ఎవరికి మెంటల్ బ్యాలన్స్‌ తప్పిందని ప్రశ్నించారు. ఇక నడ్డా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడంపై కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఓవైపు గాంధీని చంపిన గాడ్సేను చీకట్లో పొగుడుతూ బయటకు మాత్రం గాంధీ విగ్రహం వద్ద మొకరిల్లితే ఎవరు నమ్మరని ఆయన దుయ్యబట్టారు..

    Bandi sanjay : బండి సంజయ్‌కు బెయిల్.. వెంటనే విడుదల చేయలంటూ ఆదేశాలు


    కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అభివృద్ది కార్యక్రమాలను చేపట్టలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతుంటే.. తెలంగాణకు వచ్చి విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఇక కేంద్రంపై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే... సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతారని ఫైర్ అయ్యారు...

    జీవో పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ఉద్యోగులు ,ప్రభుత్వానికి మధ్య సంబంధం ఉంటుందని కాని, బీజేకి ఏం సంబంధమని అని ప్రశ్నించారు. కనీసం వారికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వారికి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: JP Nadda, KTR, Telangana, Telangana bjp

    తదుపరి వార్తలు