హైదరాబాద్(Hyderabad)లో దీపావళి రోజు జరిగిన రెండు చిన్న సంఘటనలు చివరకు పోలీస్ కేసుల(Police case) వరకు వెళ్లాయి. దీపాల పండుగను ఆనందంగా జరుపుకుంటుంటే చిన్న కారణాలతో పెద్ద గొడవగా మార్చేశారు. ఒకచోట టీఆర్ఎస్(TRS)నేత దౌర్జన్యం ప్రదర్శిస్తే మరో చోట భిన్న తమ ఇంటి ముందు దీపాలు వెలిగించారని ఓ ఫ్యామిలి పొరుగు ఇంటి వారిపై గొడవకు దిగారు. ఈ రెండు సంఘటనల్లో ఒకటి మేడ్చల్‌లో జరిగితే ..మరొకటి చిక్కడపల్లిలో చోటుచేసుకుంది.
క్రాకర్స్ ఇంటి వైపు వచ్చాని ..
పదవులను అడ్డుపెట్టుకొని పెద్దరికం చేయాలని కాని పంచాయితీలు కాదు. దీపావళి రోజున మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు చేసిన దౌర్జన్యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పండుగ పూట అందరితో సహృదయంతో నడుచుకోవాల్సింది పోయి గొడవకు దిగాడు మేడ్చల్ మున్సిపల్ 22వ వార్డు కౌన్సిలర్ మాధవి భర్త సాటే నరేందర్. తన ఇంటి పక్కన నివాసముంటున్న మోహన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లోంకి చొరబడి దాడికి పాల్పడ్డారు. దీపావళి పండుగ సందర్భంగా మోహన్‌రెడ్డి ఇంట్లో కాల్చిన టపాసులు తన ఇంట్లో పడ్డాయనే కోపంతో అనుచరులతో కలిసి దాడి చేయడం వివాదానికి దారి తీసింది.
పక్కింటి వారిపై దౌర్జన్యం
టీఆర్ఎస్ నేత అనుచరులు ఇంట్లోకి చొరబడి మహిళలపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారని బాధితుడు వినోద్ మోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు నరేందర్‌పై అతని అనుచరులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దీపాన్ని తన్ని అవమానిస్తారా..
ఇదే తరహాలో చిక్కడపల్లిలో మరో సంఘటన జరిగింది. అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్ యజమాని దీపావళి రోజున దీపాలు వెలిగించారు. అయితే పొరుగు ఇంట్లో ఉంటున్న మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆ దీపాన్ని కాలితో తన్నడంతో రెండు ఫ్లాట్లలో నివసిస్తున్న వాళ్లు గొడవపడ్డారు.
Christian neighbors turning violent against Hindu family for celebrating Diwali in Hyderabad ????????????!! pic.twitter.com/erQ9NKpce8
— ℙ????ℝ????????ℍ????ℝ ???? गव॔ से कहो हम हिंदू है ???? (@parasar_108) October 26, 2022
పొగరుబోతులపై కేసు ..
రెండు ఫ్యామిలీలు ఘర్షణ పడిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో పోలీసులు దీపాన్ని కాలితో తన్నిన మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఐపీసీ సెక్షన్ 295A కింద కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. పొరుగున ఉంటున్న వాళ్లను దూషించినందుకు, ఉద్దేశ పూర్వకంగా గొడవపడినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad crime, Telangana News