హోమ్ /వార్తలు /తెలంగాణ /

Assam CM in Hyderabad: చిచ్చు రేపిన అస్సాం సీఎం రాక.. గణేశ్​ నిమజ్జనం వేళ హైదరాబాద్​లో ఉద్రిక్తత​

Assam CM in Hyderabad: చిచ్చు రేపిన అస్సాం సీఎం రాక.. గణేశ్​ నిమజ్జనం వేళ హైదరాబాద్​లో ఉద్రిక్తత​

మైక్​ లాగుతున్న టీఆర్​ఎస్​ న

మైక్​ లాగుతున్న టీఆర్​ఎస్​ న

తెలంగాణ రాజధానిలో మరో కొత్త టెన్షన్​ మొదలైంది. ప్రశాంతంగా సాగుతున్న గణేశ్​ నిమజ్జనం కార్యక్రమంలో అలజడి మొదలైంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ (Telangana) రాజధానిలో మరో కొత్త టెన్షన్​ మొదలైంది. ప్రశాంతంగా సాగుతున్న గణేశ్​ నిమజ్జనం (Ganesh Immersion) కార్యక్రమంలో అలజడి మొదలైంది. నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ (Hyderabad)​ నగరానికి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Assam CM Himanta Biswa Sharma) రావడమే దీనికి కారణం. వేడుకల్లో హిమంత రాజకీయాలు మాట్లాడటంతో ఈ ఉద్రిక్తత నెలకొంది. ఇది ఇపుడు నేషనల్ ఇష్యూ అయి కూర్చుంది. ఇంతకీ ఏం జరిగింది?

  ఎం జె మార్కెట్ (MJ Market) వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వేదికపై మాట్లాడుతుండగా ఓ టిఆర్ఎస్ నేత (TRS Leader) అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వేదికపై మాట్లాడుతుండగా సీఎం కేసీఆర్ (CM KCR) ను విమర్శిస్తున్నారని మైకు లాక్కునేందుకు టిఆర్ఎస్ నేత నందు బిలాల్ ప్రయత్నించాడు. దీంతో బిజెపి (BJP), టిఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్ నేత నందును అక్కడ నుంచి తరలించారు పోలీసులు.

  కేసీఆర్​పై అస్సాం సీఎం విమర్శలు..

  కాగా, అంతకుముందు కేసీఆర్‌ జాతీయపార్టీపై అస్సాం సీఎం  సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయి.. కెసిఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కెసిఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదని విమర్శలు చేశారు. కేసీఆర్​ చంద్రుని మీదనో, సూర్యుని మీదనో సముద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుంటే చేసుకొని.. కెసిఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు అందుకే జాతీయ పార్టీ అని అంటున్నాడని ఎద్దేవా చేశారు.

  అయితే.. ఈ సంఘటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ స్పందించారు. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టేందుకే అసోం సీఎంను తెచ్చారు.. మేం కూడా అసోం వెళ్లి మాట్లాడగలమని హెచ్చరించారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండటం బీజేపీకి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

  ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. శర్మ వైఖరిని తప్పుపట్టారు. ప్రశాంతంగా శోభాయాత్ర జరుగుతుండగా. సీఎం కేసీఆర్‌పై అనుచితంగా మాట్లాడటం సరికాదని కామెంట్ చేశారు. ఇదీ సరికాదని.. తీరు మార్చుకోవాలని సూచించారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనీయరా అని బీజేపీ నేతలను అడిగారు. హిమంత శర్మ ఇక్కడికి రెచ్చగొట్టేందుకు వచ్చారా అని అడిగారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే తీసుకొచ్చారా అని మండిపడ్డారు. మేం అసోం వెళ్లి మాట్లాడగలం అని తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Assam, Ganesh Chaturthi​ 2022, Hyderabad

  ఉత్తమ కథలు