తెలంగాణాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులతో టీఆర్.ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే గంగుల కమలాకర్ (Gangula Kamalakar), మల్లారెడ్డి (Minister Mallareddy) నివాసాల్లో అధికారుల రైడ్స్ తో మిగతా నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఇక నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత (MLC Kavita)ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేత, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని వార్తలొచ్చాయి. ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అందుకే ఆయన అందుబాటులో లేరనే ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలపై మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, కావాలనే టీఆర్ఎస్ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) ఆగ్రహం వ్యక్తం చేశారు.
నకిలీ సీబీఐ శ్రీనివాస్ ఎవరు?
విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నేను సీబీఐ అధికారిని అని బొంతు రామ్మోహన్ కు ఫంక్షన్ లో పరిచయం అయ్యాడు. అయితే అతనితో లావాదేవీలు ఏమి జరపలేదని, కేవలం ఫంక్షన్ లో మాత్రమే కలిశానని బొంతు రామ్మోహన్ చెప్పుకొచ్చారు. కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఒకవేళ తనకు సీబీఐ అధికారులు నోటీసులు ఇస్తే తానే చెబుతానని అన్నారు. టీఆర్.ఎస్ నాయకులను బద్నామ్ చేయడానికే ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. అబద్దాన్ని ప్రచారం చేసిన చివరకు నిజమే బయటకు వస్తుందన్నారు. తాము అవసరమైతే జైలుకు వెళతామని అంటే తప్పు చేసినట్టు కాదని అన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేకే మొబైల్ స్విచ్ ఆఫ్ చేశా అని కానీ దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు సిబిఐ నోటీసులు ఇవ్వడం గాని అరెస్ట్ చేయడం గాని జరగడం లేదని చెప్పుకొచ్చారు.
నిన్న గంగులకు సిబిఐ నోటీసులు..
టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) కు సీబీఐ (Central Burew Of Investigation) నిన్న నోటీసులు ఇచ్చింది. నేడు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ (Central Burew Of Investigation) నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ సీబీఐ (Central Burew Of Investigation) పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. తాను సిబిఐ (Central Burew Of Investigation) అధికారిని అంటూ చెలామణి అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ (Central Burew Of Investigation) ఇటీవల కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) తో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో మంత్రి గంగుల (Minister Gangula Kamalakar)ను సాక్షిగా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగులకు (Minister Gangula Kamalakar), శ్రీనివాస్ కు మధ్య సంబంధాలపై అధికారులు విచారించనున్నట్టు తెలుస్తుంది. నేడు ఢిల్లీకి వెళ్లిన గంగులను సిబిఐ ప్రశ్నిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.