HYDERABAD TRS FORMER MP VINOD KUMAR ALLEGATIONS ON CENTRAL GOVERNMENT OVER EDUCATIONS INSTITUTIONS ALLOCATION IN TELANGANA PRV
Telangana: కేంద్రం మొండి వైఖరి వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం.. బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం కలిసి రావడం లేదు.. వినోద్ కుమార్ సంచలన ఆరోపణలు
Boinapally Vinod Kumar, vice-chairman of the State Planning Commission, alleged that Telangana was not sanctioned new educational system. There are four BJP MPs from the state
తెలంగాణకి కొత్తగా విద్యా సంస్థలను (Educational System) మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod kumar) ఆరోపించారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదన్నారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి కొత్తగా విద్యా సంస్థలను (Educational System) మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod kumar) ఆరోపించారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు (BJP MP) ఉన్నా.. విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదన్నారు. కనీసం ఈ విషయంలో వారు సొంతంగా కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని వినోద్ కుమార్ ఆరోపించారు.
జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయం..
రాష్ట్రంలో బీజేపీ ఎంపీల (BJP MP) వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని వినోద్ కుమార్ అన్నారు. ఇప్పటికైనా వారు చిత్తశుద్ధితో రాష్ట్రం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసిందని వినోద్ కుమార్ అన్నారు. అయితే కొత్త జిల్లాల్లో (New Districts) జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం (Central Government)పై ఉందని వినోద్ కుమార్ తెలిపారు. అయితే ఈ విషయంలో కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు.
తెలంగాణలో నవోదయ విద్యాలయాలు (Navodaya Vidyalaya), కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ, హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( IISER ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM ) వంటి పలు విద్యా సంస్థలు మంజూరు చేయాలని తెలంగాణ ఎప్పటి నుంచో కోరుతోందని వినోద్ కుమార్ తెలిపారు. అయినా వాటిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మేలు..
రాష్ట్రంలో హైదరాబాద్ లో తప్ప 9 ఉమ్మడి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఉన్నాయని వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. కానీ నిబంధనల ప్రకారం.. మరో 23 నవోదయ విద్యాలయాలు రావాల్సి ఉందని తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వినోద్ కుమార్ తెలిపారు.
షర్మిలా తెలుసుకొని మాట్లాడండి..
రైతు బీమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైఎస్ షర్మిలకు బోయినపల్లి వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కొంచె తెలుసుకుని మాట్లాడండి అంటూ చురకలంటించారు. రైతు బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి అమలు చేస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు.
ఎల్ఐసి, జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని ఆయన అన్నారు. కేంద్రం, పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇన్సూరెన్స్ సహా వివిధ పథకాలు 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వర్తిస్తున్నాయని, ఈ విషయం మీకు తెలియదా..? అని వైఎస్ షర్మిలను ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.