Huzurabad TRS candidate : TRS అభ్యర్థి ఈయనే...నేడు ప్రకటించనున్న గులాబి బాస్..!

మంత్రి హరీష్ రావుతో గెల్లు శ్రీసివాస యాదవ్

Huzurabad TRS candidate : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై నేడు ఫుల్‌స్టాప్ పడనుంది. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఖారారు చేసింది..పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ నేడు అభ్యర్థిని ప్రకటించనున్నట్టు సమాచారం. ఉద్యమ నేపథ్యంతో పాటు బీసి వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపనుంది.

  • Share this:
    హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను టీఆర్ఎస్ పూర్తి చేసింది.ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ పార్టీ అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్దమైంది..కాగా నేడు మంచి రోజు కూడా కావడంతో పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించునున్నట్టు సమాచారం. ఈటలకు దీటుగా బీసీ వర్గానికి చెందిన నేతతో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్న గెల్లు శ్రీనివాస యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు సమాచారం. శ్రీనివాస యాదవ్‌పేరును నేడు ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలోనే అభ్యర్థి ప్రకటించనున్నట్టు తెలుస్తోంది..మరోవైపు ఈనెల 16న జరగనున్న హుజూరాబాద్ సమావేశంలో దళిత బంధును అధికారికంగా ప్రారంభించడంతో శ్రీనివాస యాదవ్‌ను పార్టీ అభ్యర్థిగా పరిచయం చేయనున్నారు..

    గత కొద్ది రోజులుగా పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన గులాబి బాస్ కేసిఆర్ ఎట్టకేలకు ఆ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేశారు..అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్వంత పార్టీ అభ్యర్థికే పట్టం కట్టనున్నారు. అది కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తినే పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో సూదీర్ఘ కాలం ఉద్యమ నేపథ్యం ఉన్న ఈటలకు దీటుగా అంతే నేపథ్యం ఉన్న గెల్లు శ్రీనివాస యాదవ్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. మరోవైపు బీసి సామాజిక వర్గం కూడా కావడంతో పార్టీతోపాటు ప్రతిపక్షాలు ,ఇటు ప్రజల నుండి ఎలాంటీ విమర్శలు ఎదురయ్యో అవకాశం ఉండకండా జాగ్రత్తలు తీసుకున్నారు.

    ఇక హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే..పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేసినా..అనేక వ్యతిరేకతలు ఎదురుకావడంతో ఆయనకు ఎమ్మెల్సీతో సరిపుచ్చారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి ఎల్‌ రమణతోపాటు పెద్దిరెడ్డి, స్వర్గం రవి లాంటి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించినా.. చివరకు పార్టీ కార్యకర్తకే పట్టం కట్టేందుకు టీఆర్ఎస్ బాస్ సిద్దమయ్యారు.

    కాగా ఇప్పటి వరకు పార్టీకి అభ్యర్థి కరవయ్యాడనే విమర్శలు ఎదుర్కొన్న పార్టీ నేటి నుండి నేరుగా పార్టీ అభ్యర్థితో ప్రజల్లోకి వెళ్లనుంది..నియోజకవర్గంలో ఎలాంటీ పరిణామాలు చోటు చేసుకోకుండా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు బాల్కసుమన్ , పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు.
    Published by:yveerash yveerash
    First published: