2001 నుండి ఉద్యమనాయకుడు కేసీఆర్కు ( cm kcr ) అండగా పార్టీకి నిబద్దతగా, క్రమశిక్షణతో పదవిలో ఉన్నా, లేకున్నా ఉద్యమం చేసిన నిజమైన ఉద్యమకారుడు గెల్లుశ్రీనివాస్ యాదవ్ అని, ( Gellu srinivas yadav )అందుకే కేసీఆర్ గారు గెల్లును బలపర్చారని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారన్నారు మంత్రి గంగుల కమలాకర్, ( Gangula kamalakar)
ఈ సంధర్బంగా మాట్లాడిన నేతలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. మంచి రోజైన శుక్రవారం రోజు టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసారని, కేసీఆర్ బొమ్మ మీదే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని, తాము సైతం అలాగే గెల్చామని రేపు హుజురాబాద్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సైతం కేసీఆర్ బొమ్మపైనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు...
ఇక ఓట్ల కోసం వస్తున్న ఈటెల రాజేందర్ ఐదు సంవత్సరాల కాలనికి హుజురాబాద్ (Huzurabad ) ప్రజలు ఆయనకు అవకాశం ఇస్తే, అవకాశవాదంతోపాటు వ్యక్తిగత ఎజెండాతో మధ్యలోనే కత్తి వదిలేసి పోరాటాన్ని ఆపేశారని దుయ్యబట్టారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అలాకాకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తారన్నారు, గతంలో హుజురాబాద్ నియెజకవర్గం టీఆర్ఎస్ కు కంచుకోటని, 2018 కంటే అత్యధిక మెజార్టీని సాధిస్తామన్నారు గంగుల కమలాకర్..
ఇది చదవండి :పిల్లలను పక్కరూంలో పడుకోవాలని చెప్పిన తండ్రి.. అర్థరాత్రి పూట దారుణానికి దిగాడు...?
కేసీఆర్ పై ప్రేమ ఉన్నప్పటికీ ఈటెలపై వ్యతిరేకతతో గతంలో కోల్పోయిన ఓట్లు సైతం ఈ సారి సాధిస్తున్నామన్నారు. అభివృద్దే మనందరికీ ముఖ్యం కావాలని, ఈటల నిర్లక్ష్యంతో హుజురాబాద్ కోల్పోయిన అభివృద్దిని తిరిగి గాడిలో పెట్టాలంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు తెలియజేసి ఓటేయాలని కోరారు ఆయన కోరారు.
ఇక మాజీ ఎంపి, ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ (vinod kumar ) మాట్లాడుతూ, ఆత్మగౌరవం పేరుతో ఈటెల ఆత్మవంచన చేసుకుంటున్నారన్నారు, హుజురాబాద్ ప్రజలకు ఆత్మగౌరవ సమస్యలేదన్నారు, హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంటా, కమలాపూర్ రైతులు, ప్రజలకు అప్పుల తిప్పలు లేకుండా రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచితకరెంటు ద్వారా కోట్లాది రూపాయల్ని అందించి హుజురాబాద్ తో పాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ గారు నిలబెట్టారన్నారు. వెన్నుపోటుదారుల వెన్నులో వణుకుపుట్టేవిదంగా టీఆర్ఎస్ అభ్యర్తిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ని ప్రజలు గెలిపించబోతున్నారన్నారు.
ఇది చదవండి : ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు... ఉత్సాహంతో పని చేయండి..
ప్రజలంతా కులమతాల కతీతంగా ఓటేయాలని అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అభ్యర్థించారు, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దుతు తెలయజేయాలని ప్రతీ ఒక్కరూ కారు గుర్తుపై ఓటేయాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.