Home /News /telangana /

HYDERABAD TRAGIC INCIDENT IN HYDERABAD MURDER OF A WOMAN WHO RAN AWAY FROM HOME DETAILS VB

Hyderabad Murder: హైదరాబాద్ లో దారుణ ఘటన.. ఇంటి నుంచి తప్పిపోయిన మహిళ హత్య.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Murder: ఇంటి నుంచి మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ దారుణ హత్యకు గురైంది. అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని పాతిపెట్టి తప్పించుకున్నారు దుండగులు. పూర్తి వివరాలివే..

  ఇంటి నుంచి మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ దారుణ హత్యకు గురైంది. అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని పాతిపెట్టి తప్పించుకున్నారు దుండగులు. పూర్తి వివరాలివే.. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. 48 ఏళ్ల మహిళ రాజమణి మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేట(Malakpet) దగ్గర రాజమణి(Rajamani) మృతదేహాన్ని పాతిపెట్టినట్టు విచారణలో తేలింది. ఆ మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  దారుణ ఘటన.. ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి.. అత్యాచారం, హత్య చేశాడో యువకుడు.. మృతదేహాన్ని చాపలో చుట్టి..


  ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో సైదాబాద్‌ సింగరేణి కాలనీలో నల్గొండ జిల్లా చందంపేట మండలానికి చెందిన ఓ కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. వారి పెద్దమ్మాయి(5) రోజులాగానే ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. స్థానిక మసీద్, చర్చిలో మైకుల ద్వారా ప్రచారం చేయించారు. అయినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సింగరేణి కాలనీలో గాలించారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించినా ఫలితం లేకపోయింది. అయితే వాళ్ల ఇంటి పక్కనే ఉంటున్న వ్యక్తి పేరు రాజు. అతడు చెడు వ్యసనాలకు అలవాటు పడి ల్లర దొంగతనాలు పాల్పడేవాడు. రోజు మద్యం సేవించి భార్య, పిల్లల్ని వేధించేవాడు.

  Wife And Husband: వీడెవడండి బాబు.. పుట్టింటికి వెళ్తానన్న భార్య ముక్కు కోసేశాడు..


  దీంతో కొద్ది రోజుల క్రితం అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత కొన్ని రోజులకు అతడి తల్లి కూడా మరణించింది. దీంతో ఒంటరిగా ఉంటున్న అతడు కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూజల్సాలు చేస్తూ తిరుగుతుండేవాడు. చిన్నారి నాయనమ్మకి పక్కింట్లో ఉండే రాజుపై అనుమానం వచ్చింది.  అనుమానం బలపడటంతో ఉదయం 12 గంటల ప్రాంతంలో తాళం పగలగొట్టి చూడగా పరుపులో చిన్నారి శవమై కనిపించింది. ఆమె అత్యాచారం చేసి.. చివరకు హత్య చేసి శవాన్ని పరుపులో పెట్టి ఇంటి నుంచి పారిపోయాడు. బాలిక మృతదేహాన్ని పరుపులో మూట కట్టి ఇంటికి తాళం వేసి అక్కడినుంచి పారిపోయాడు. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి.

  Crime News: హోటల్ గదిలో బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఒకరు బీజేపీ లీడర్.. చివరకు ఏమైందంటే..


  నిందితుడిని పట్టుకొని తమకు అప్పగించేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని పట్టుబట్టారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి అదృశ్యమైంది. అర్ధరాత్రి 12 గంటలకు నిందితుడు రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. నిందితుడు రాజును తమకు అప్పగించే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని బస్తీవాసులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  Crime News: ప్రేమించడం లేదంటూ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. ఎక్కడంటే..


  అయితే ఇదిలా ఉండగా.. సైదాబాద్ సింగ‌రేణిలో హ‌త్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ శుక్ర‌వారం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. చిన్నారి కుటుంబంలో ఒక‌రికి పొరుగు సేవ‌ల విభాగంలో ఒక‌రికి ఉద్యోగం క‌ల్పిస్తాం. డ‌బుల్ బెడ్రూం(Double Bedroom) ఇల్లు మంజూరు చేయిస్తాం. బాలిక కుటుంబంలోని మ‌రో ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉచిత విద్య‌ను అందిస్తామ‌ని క‌లెక్ట‌ర్ హామీ ఇచ్చారు. వీలైనంత త్వ‌ర‌గా నిందితుడికి శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:Veera Babu
  First published:

  Tags: Attempt to murder, Hyderabad, Telangana Police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు