HYDERABAD TRAFFIC SI STOPPED KTR CAR FOR WRONG ROUTE AT BAPU GHAT REPORTS SU
Minister KTR: రాంగ్ రూట్లో మంత్రి కేటీఆర్ కారు.. అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసు..!
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)
గాంధీ జయంతి రోజున తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఊహించని విధంగా వార్తల్లో నిలిచారు. ఆయన కారు రాంగ్ రూట్లో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసు అడ్డుకున్నారు.
గాంధీ జయంతి రోజున తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఊహించని విధంగా వార్తల్లో నిలిచారు. ఆయన కారు రాంగ్ రూట్లో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసు అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని బాపూఘాట్లో (Langar House Bapu Ghat) శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీ జయంతి కావడంతో పలువురు ప్రముఖులు మహాత్మునికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బాపూ ఘాట్‌లో గాంధీ జయంతి (Gandhi Jayanti ) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన తన వాహనంలో బయలుదేరారు. ఆ సమయంలోనే కేటీఆర్ వాహనం రాంగ్ రూట్లో (Wrong Route) ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ కారు అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారి ఒకరు ఆపేశారు. కారు రాంగ్ రూట్లో వస్తుందని చెప్పారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు.. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ట్రాఫిక్ పోలీసులు.. కేటీఆర్ కాన్వాయ్‌లోని ఓ కారును ఆపేశారా..? లేకుంటే ఆపిన కారులోనే మంత్రి ఉన్నారా..? అనే విషయం మాత్రం స్పష్టత లేదు.
మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొందరు ట్రాఫిక్ పోలీసును అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం మంత్రి కారును అడ్డుకోవడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఏది ఎమైనా ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.