హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు, ఇప్పటికే నగరంలో పలు చోట్ల కనస్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు, ఫ్లై ఓవర్ వర్కులు జరుగుతుండటంతో.. పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు.నగరంలో ఇందిరా పార్కు( Indira Park ) నుంచి వీఎస్టీ( VST ) వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి( Steel Bridge ) నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Hyderabad Traffic Police ) ప్రకటించారు.
ఈ ట్రాఫిక్ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ మీదుగా వెళ్లే వాహనదారులు.. సుధా నందిని హోటల్ లేన్ వద్ద లెఫ్ట్ తీసుకొని సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్ట్రీట్ నంబర్ 9 మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కు చేరుకోవాల్సి ఉంటుంది. వీఎస్‌టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ వెళ్లాలనుకునే వాహనదారులు.. క్రాస్ రోడ్డులోని హేబ్రోన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ హాస్పిటల్ మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కుకు చేరుకోవాలి.
ఇక ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనదారులు.. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి జగదాంబ హాస్పిటల్, ఆంధ్రా కేఫ్, హేబ్రోన్ చర్చి, చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి స్ట్రీట్ నంబర్ 9 మీదుగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి మెయిన్ రోడ్డు చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ ఆంక్షలు నగరంలో ఆయా ప్రాంతాల్లో మూడు నెలల పాటు ఉంటాయని అధికారులు తెలిపారు. నగరవాసులంతా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad Traffic Police, Local News, Telangan traffic police