హైదరాబాద్ (Hyderabad) నగరంలో నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల (Bjp national executive meeting) నేపథ్యంలో జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే సభకు నాలుగు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారురు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటష్ట చర్యలు తీసుకుంటున్నారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు. హెచ్‌ఐసీసీ (HICC) పరిధిలో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Hyderabad Traffic diversions) విధించారు. నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ వెళ్లేవారు.. సీఓడీ నుంచి దుర్గం చెరువు, బయోడైవర్సిటీ మీదుగా రాకపోకలు. ఆర్సీపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిచౌలి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్ (BHEL), హెచ్‌సీయూ, ట్రిపుల్ ఐటీ మీదుగా వెళ్లాలి. మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వచ్చేవారు ఏఐజీ ఆసుపత్రి, దుర్గం చెరువు మీదుగా వెళితే సులభంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 వరకు..
సభ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హెచ్ఐసీసీ మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రాజ్ భవన్, పంజాగుట్ట, బేగంపేట్ ఎయిర్పోర్ట్, ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎన్డీ రోడ్, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాల వైపు వాహనదారులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సీపీ ఆనంద్ కోరారు. సికింద్రాబాద్ పరేడ్ డ్లో జరిగే విజయ సంకల్ప సభ నేపథ్యంలో మొత్తం 7 గేట్లు ఉండగా, 3,4, 5, 6, 7వ గేట్ల నుంచి ప్రజలను అనుమతించనున్నారు.
సభకు ఆటంకం కలగకుండా టివోలీ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్ మధ్య రహదారి మూసివేయనున్నారు. దాంతో చిలకలగూడ, అలుగడ్డబాయి, సంగీత్, వైఎంసీఏ, ప్యాట్నీ, ఎస్బీహెచ్ క్రాస్ రోడ్లు, ప్లాజా, సీటీఓ జంక్షన్, బ్రూక్ బాండ్ జంక్షన్, స్వీకా రాప్కార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి క్రాస్ రోడ్, తాడ్బండ్ సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన పల్లి క్రాస్ రోడ్, రసూల్పురా, బేగంపేట్, ప్యారడైజ్ ప్రాంతాల వైపు రాకుండా వాహనదారులు ప్రత్యామ్నాయాలను చూసుకో వాలని పోలీసులు సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు సకాలంలో చేరుకునేలా ముందుగానే బయ లుదేరాలని పోలీసులు సూచించారు. ప్లాట్‌ఫామ్ నంబర్ 1 వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్లే రూట్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశముందని, చిల కలగూడ వైపు నుంచి రైల్వే స్టేష న్ ప్లాట్‌ఫాం నెం. 10 నుంచి లోపలికి వెళ్లాలని సూచించారు.
పార్కింగ్ కోసం మ్యాప్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులు గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ క్రాస్రోడ్స్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఐమాక్స్ రోటరీ, వీవీ విగ్రహం, పంజాగుట్టకు చేరుకుంటే తమ గమ్యస్థానాలకు సులభంగా వెళ్లవచ్చు. ఉప్పల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వారు రామంతపూర్ -అంబర్పేట్- హిమాయత్నగర్- వివి విగ్రహం- పంజాగుట్ట వెళ్లాలి. పంజాగుట్ట/అమీర్పేట వైపు నుంచి తార్నాక / ఉప్పల్ వైపు వచ్చే ట్రాఫిక్ను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్ - నిరంకారి - సైఫాబాద్ ఇక్బాల్ మినార్ -తెలుగు తల్లి ఫ్లై ఓవర్ లోయర్ ట్యాంక్ బండ్ - కవాడిగూడ - ముషీరాబాద్ చిల్కలగూడ రోటరీ - మెట్టుగూడ వైపు మళ్లిస్తారు. బహిరంగ సభకు వచ్చే ప్రజల పార్కింగ్ స్థలాల కోసం పోలీసులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన మ్యాప్ ను పరిశీలించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BJP National Executive Meeting 2022, Hyderabad, Traffic rules