హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bonalu | Hyderabad Traffic Diversions: బోనాల నేపథ్యంలో హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. డైవర్సన్​ పాయింట్లు ఇవే..

Bonalu | Hyderabad Traffic Diversions: బోనాల నేపథ్యంలో హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. డైవర్సన్​ పాయింట్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రాలు

ప్రతీకాత్మక చిత్రాలు

జూలై 17 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు  జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్​ డైవర్సన్​ చేయనున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండగ (Bonalu festival) కోసం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం (Secunderabad Ujjaini Mahankali temple) ముస్తాబవుతోంది. జూలై 17 ఆదివారం అమ్మవారి బోనాల ఉత్సవాలు  జరగనున్నాయి. లష్కర్ బోనాలకు (Lashkar Bonalu) సీఎం కేసీఆర్ (CM KCR) సహా వీఐపీలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో లష్కర్ బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులు, వీఐపీ (VIP)లు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉండటంతో మహంకాళి ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.  ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసేవరకు హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేయనున్నారు. ట్రాఫిక్ ను డైవర్షన్స్  (Traffic Diversions) చేశారు. ఆలయానికి 2 కి.మీ దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఇవే.. 

  రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెహికల్స్ చిలకలగూడ క్రాస్ రోడ్స్, గాంధీ హాస్పిటల్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, కవాడిగూడ, మ్యారియట్ హోటల్ మీదుగా ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సీటీవో జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వచ్చే వెహికల్స్ ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సింధి కాలనీ, మినిస్టర్ రోడ్స్, రాణిగంజ్ క్రాస్ రోడ్స్, కర్బాల మైదాన్ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది..

  బైబిల్ హౌస్ నుంచి రైల్వేస్టేషన్, తిరుమలగిరి వైపు వచ్చే వాహనాలు ఘస్మండి క్రాస్ రోడ్స్ మీదుగా సజ్జన్‌లాల్ స్ట్రీట్, హిల్ స్ట్రీట్ రాణిగంజ్ వైపు దారి మళ్లించనున్నారు.. కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెళ్లే వెహికల్స్ ను రాణిగంజ్ క్రాస్ రోడ్స్, మిని స్టర్ రోడ్స్, రసూల్ పురా క్రాస్ రోడ్స్, పీఎస్ టీ ఫ్లై ఓవర్, హెచ్ పీఎస్ యూటర్న్, సీటీవో, ఎస్ బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురం లేన్ మీదుగా దారి మళ్లించనున్నారు. ఎస్బీఐ క్రాస్ రోడ్స్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్, మినిస్టర్ రోడ్, క్లాక్ టవర్, సంగీత్ క్రాస్ రోడ్స్, చిలకలగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, కవాడిగూడ, ట్యాంక్ బండ్ రూట్లో దారి మళ్లించనున్నారు.

  పార్కింగ్ ప్రాంతాలు.. 

  సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వెహికల్స్.. ఓల్డ్ జైల్ ఖాన్ ఓపెన్ ప్లేస్ లో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ ను ఇస్లామియా హై స్కూల్ గ్రౌండ్ లో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. రాణిగంజ్, అడయ్య క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను అడయ్య మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

  సెయింట్ జాన్స్, రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీహెచ్ వైప నుంచి వచ్చే వెహికల్స్ హరిహర కళా భవన్, మహబూబియా ఎస్ఐటీ కాలేజీ వద్ద పార్క్ చేయాలి రసూల్ పురా, సీటీవో, బాలంరాయి నుంచి వాహనాలను మహాత్మ గాంధీ రోడ్, గాంధీ విగ్రహం వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మంజు థియేటర్స్ నుంచి వచ్చే వెహికల్స్.. అంజలి థియేటర్ లేస్ లో పార్కింగ్

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad Traffic Police, Telangana Bonalu

  ఉత్తమ కథలు