Ek Shaam Charminar Ke Naam: ప్రతి ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్ బండ్ సందర్శకులకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సందర్శకుల వాహనాలను కూడా ట్యాంక్ బండ్‌పైకి అనుమతించకుండా చర్యలు తీసుకన్నారు. ఆదివారం నాడు ట్యాంక్‌బండ్ వద్దకు వచ్చి కాలక్షేపం చేసే వారికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా పలు వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ విధంగానే.. హైదరాబాద్‌కు మణిహారంగా చార్మినార్ (Charminar) వద్ద కూడా ఈనెల 17వ తేదీ ఆదివారం నుంచి వారం వారం ‘ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్’(Ek Shaam Charminar Ke Naam) పేరుతో ఫన్‌డే నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సందర్శకులను అలరించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సాగే ‘ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్’లో.. సాయంత్రం 6:30 గంటలకు పోలీస్ బ్యాండ్ నిర్వహించనున్నారు. రాత్రి 8:30 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక అర్ధరాత్రి వరకు లాడ్ బజార్‌ను తెరిచి ఉంచనున్నారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
Free Petrol: మూడు రోజులు పెట్రోల్ ఫ్రీ.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే..?
ఈ క్రమంలోనే ఆదివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ( traffic restrictions) విధించనున్నట్టుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. అఫ్జల్ గంజ్ (Afzalgunj), మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మెట్టీ కా షేర్, కాళీకమాన్, ఎతెబార్ చౌక్ వైపు మళ్లించనున్నారు. ఫలక్‌నుమా, హిమ్మత్ పురా నుంచి వచ్చే వాహనాలు పంచమొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్, మొఘల్ పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపు మళ్లించనున్నారు. అఫ్జల్ గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మెట్టీ కా షేర్, కాళీకమాన్, ఎతెబార్ చౌక్ వైపు మళ్లించనున్నారు. ఫలక్‌నుమా, హిమ్మత్ పురా నుంచి వచ్చే వాహనాలు పంచమొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్, మొఘల్ పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపు మళ్లించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ అంజనీ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం చార్మినార్ మార్గం గుండా ప్రయాణించే సాధారణ ప్రజలు.. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు కోరారు.
Acidity: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా?.. అయితే ఈ ఆహారాలు, చిట్కాలతో చెక్ పెట్టండి
పార్కింగ్..
చార్మినార్ వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ‘ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్’నిర్వహించనున్న నేపథ్యంలో.. సందర్శకుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
అఫ్జల్ గంజ్, నయాపూల్, మదీనా వైపు నుంచి వచ్చే వారికి.. సర్దార్ మహాల్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో, కోట్ల అలీజా Mufeed-Ul-Anam Boys High School, మదీనా ఎస్ వైజే కాంప్లెక్స్, చార్మినార్ ఏయూ ఆసుపత్రి, చార్మినార్ బస్ టెర్మినల్ (Charminar Bus Terminal) ఇన్ గేట్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
Car Loan: కారు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక తెలుసుకోండి..
ముర్గీచౌక్, షాలిబండ వైపు నుంచి వచ్చే వారికి.. మోతీ గల్లీ పెన్షన్ ఆఫీసు, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం, ఖిల్వత్ గ్రౌండ్, చార్మినార్ ఏయూ ఆసుపత్రి, చార్మినార్ బస్ టర్మినల్ ఇన్ గేట్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
మదీనా, పురానాపూల్, గోషామహల్ వైపు నుంచి వచ్చే వారికి.. కులీకుతుబ్ షా స్టేడియం (Quli Qutub Shah Stadium), సిటీ కళాశాల, ఎంజే బ్రిడ్జ్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.