Home /News /telangana /

మహాత్ముడి కోసం రెండు నిమిషాల మౌనం...

మహాత్ముడి కోసం రెండు నిమిషాల మౌనం...

రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన ట్రాఫిక్ పోలీసులు

రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన ట్రాఫిక్ పోలీసులు

గాంధీ వర్థంతి సందర్బంగా హైదరాబాద్ తిరుమలగిరి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఘనమైన నివాళి అర్పించారు.

అహింసా, మానవ సేవే పరమావధిగా చేసుకొని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహాత్మగాంధీ చనిపోయి నేటికి 71 ఏళ్లు. ఈసందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా భారతీయులు ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రతీచోట మహాత్ముడి విగ్రహాల వద్ద అంజలి ఘటిస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశానికి బాపు చేసిన సేవల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. అయితే గాంధీ వర్థంతి సందర్బంగా హైదరాబాద్ తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు నివాళులర్పించారు అర్పించారు. 24 గంటలు లా అండ్ ఆర్డర్‌ను స్ట్రిట్‌గా ఫాలో అయ్మే పోలీసులు... మహాత్ముడి కోసం మౌనం పాటించారు. తిరుమల చౌరాస్తాలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిల్చొని రెండు నిమిషాల పాటు మౌనంగా మహాత్ముడికి ఘన నివాళుల ర్పించారు.

ఆ రెండు నిమిషాల సమయంలో రహదార్లపై వాహనాల రాకపోకలను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.అందుకు వాహనాదారులు కూడా తమ వాహనాల హారన్లను మోగించకుండా సహకరించారు. పాదాచారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మౌనం పాటించారు . అందరూ కూడా మౌనం పాటించారు
First published:

Tags: Hyderabad, Mahatma Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు