హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం.. బయటికి వస్తే ఏం చేస్తారో తెలుసా..?

హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల మీదకు వస్తే బైక్‌ను స్వాధీనం చేసుకోనున్నారు.

news18-telugu
Updated: April 8, 2020, 7:02 AM IST
హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం.. బయటికి వస్తే ఏం చేస్తారో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో పని లేకుండా రోడ్లపై తిరిగేవాళ్లు ఎక్కువైపోయారు. లాక్‌డౌన్ ఉందని, ఎవరూ ఇంట్లోంచి బయటికి రావొద్దని చెప్పినా చిన్న చిన్న కారణాలు చెబుతూ రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల మీదకు వస్తే బైక్‌ను స్వాధీనం చేసుకోనున్నారు. వైద్య సంబంధ, అత్యవసర కారణాలు మినహా మిగతా వాళ్లను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, పాతబస్తీ ప్రాంతాల్లో మంగళవారం వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీస్ ఉన్నతాధికారులు కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా ట్రాఫిక్‌ పోలీసులకు ఆదేశాలిచ్చారు.

కాగా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, వాహనాల స్వాధీనమే సరైన మార్గమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కారణం లేకుండా తిరిగే బైక్‌లు, కార్లపై వచ్చిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం కేసులు నమోదు చేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నామని వెల్లడించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 8, 2020, 7:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading