హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: అంబులెన్స్‌ల‌కు కొత్త రూల్స్ .. పేషెంట్‌ లేకుండా సైరన్ మోగితే ..

Hyderabad: అంబులెన్స్‌ల‌కు కొత్త రూల్స్ .. పేషెంట్‌ లేకుండా సైరన్ మోగితే ..

Ambulance(file)

Ambulance(file)

Hyderabad: హైదరాబాద్‌లో సైరన్ మోగిస్తూ రోడ్లపైకి వస్తున్న అంబులెన్స్‌పై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అత్యవసరమైనా లేకపోయినా సైరన్ వాడటం కారణంగా తలెత్తే ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ పెట్టడానికి ఏం చేస్తున్నారో తెలుసా.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  (M.Balakrishna,News18,Hyderabad)

  హైదరాబాద్‌(Hyderabad)మహానగరంలో నిత్యం ఏదో చోట అంబులెన్స్ సైరన్ (Ambulance siren)వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇందులో నిజంగా అత్య‌వ‌స‌రం ఉన్నావి చాలా త‌క్కుగానే ఉన్నాయి. న‌గ‌రంలో నిత్యం తిరుగుతున్న అంబులెన్స్‌లు చాలా వ‌ర‌కు అవ‌స‌రం లేక‌పోయిన సైర‌న్ ను ఉప‌యోగించి అన‌వ‌స‌రమైన ట్రాఫిక్‌ అంతరానికి కారణమవుతున్నారని గుర్తించారు పోలీసులు. దీంతో ఇలా అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో త‌ప్ప ఊరికే సైర‌న్ ఉప‌యోగించే అంబులెన్స్‌లపై చ‌ర్య‌ల‌కు రెడీ అవుతున్నారు.  నగరంలో 90శాతం అంబులెన్స్‌లు సైరన్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Traffic Police)గుర్తించారు. లోపల ఎమర్జెన్సీ పేషెంట్లు(Emergency patients)ఎవరూ లేకపోయినా డ్రైవర్లు (Drivers)సైరన్‌ను ఉపయోగిస్తున్నట్లుగా తేల్చారు. అన‌వ‌స‌రంగా అంబులెన్స్ సైరన్‌ ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ జామ్‌(Traffic jam)లు ఏర్పడుతున్నాయని అంటున్నారు అధికారులు.

  Food poisoning : హాస్టల్‌లో అమ్మాయిలకు బల్లిపడిన అన్నం పెట్టారు .. వార్డెన్, కుక్ సస్పెండ్  సైరన్‌ మోగిస్తే అంబులెన్స్‌ సీజే ..

  హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్‌ల వద్ద రోజూ కనీసం 5వేల అంబులెన్స్‌లు రోడ్లపైకి వస్తున్నట్లుగా గుర్తించారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. సైరన్‌ల దుర్వినియోగం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ A.V రంగనాథ్ న్యూస్18 కి తెలిపారు.  రోగులెవరూ లోపల లేని సమయంలో కూడా అంబులెన్స్‌లో సైరన్ వాడుతున్న‌ట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. మృతదేహాలను మార్చురీలకు తరలించేందుకు అంబులెన్స్‌లు సైరన్‌లను ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చారు. ఈ నిబంధ ప్ర‌కారం ఇప్పుడు అత్యవసర రోగులను తీసుకువెళ్లే అంబులెన్స్‌లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డ్రైవర్లు లేదా ఆసుపత్రి సిబ్బంది కంట్రోల్ రూమ్ నుండి క్లియరెన్స్ పొందిన త‌రువాత‌నే ట్రాఫిక్ లోకి రావాలి.

  అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ పేషెంట్‌ లేకపోతే ..

  స‌మాచారం అందించిన అంబులెన్స్‌లకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తారు. దీంతోపాటు అవయవ రవాణా వాహనాలకు కూడా గ్రీన్ ఛానెల్‌ రూట్స్ ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ పోలీసులకు స‌మాచారం అందించ‌డానికి చేయడానికి ప్ర‌తి ఆసుప‌త్రిలో ఒక‌ నోడల్ అధికారిని నియమించాలని అధికారులు ఇప్ప‌టికే ఆసుపత్రులకు సూచించారు. ఆసుపత్రులు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌తో కమ్యూనికేట్ చేయడానికి ప్రత్యేక నంబర్-8712660600 ఏర్పాటు చేశారు అధికారులు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. ఇలా అనుమతి లేకుండా సైరన్‌ని ఉపయోగించి, అత్యవసర రోగులను తీసుకువెళ్లకుండా పట్టుకున్న ఏదైనా అంబులెన్స్‌ను వెంటనే ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తామని ప్రకటించారు. అంబులెన్స్ ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేయనున్నారు.

  Revanth | Venkat Reddy : ఢిల్లీలోనూ గల్లీ రాజకీయాలే .. మునుగోడు అభ్యర్ధి విషయంలో ఎవరి ప్రయత్నాలు వాళ్లవే ..  అమల్లోకి కొత్త రూల్స్ ..

  ఇప్ప‌టికే ఈ కొత్త నిబంధనలకు సంబంధించి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సూచ‌న‌లు కూడా పంపారు అధికారులు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఈ కొత్త నింబంధనల వలన చాలా వరకు సైరన్ దుర్వనియోగాన్ని ఆపొచ్చు అంటున్నారు అధికారులు. ఫలితంగా నగరంలో అర్జెంట్‌ పనులపై వెళ్లే వాళ్లకు ట్రాఫిక్‌ సమస్యలు కొంతలో కొంత తగ్గుతాయంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ కొత్త రూల్స్‌ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తారో చూడాలి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Ambulence, Hyderabad news, Telangan traffic police

  ఉత్తమ కథలు