Home /News /telangana /

HYDERABAD TRAFFIC POLICE SEIZE BULLET WHICH PENDING 70 CHALLAN SB

70 చలాన్లు పెండింగ్...బుల్లెట్ బాబుకు ట్రాఫిక్ పోలీసుల షాక్

70 పెండింగ్ చలాన్లు చూపిస్తున్న ట్రాఫిక్ ఫోలీసులు

70 పెండింగ్ చలాన్లు చూపిస్తున్న ట్రాఫిక్ ఫోలీసులు

ఆ చలానాలకు సంబంధించి బకాయిలు రూ.12,725 ఉండటంతో ఎస్సై రమేష్‌ ద్విచక్రవానహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.

    హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను కట్టుదిట్టం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎంతగా శ్రమిస్తున్న జనం మాత్రం మారడం లేదు. రూల్స్ అతిక్రమిస్తే.. కఠినంగా వ్యవహరిస్తున్న... వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాజగా అలాంటి ఓ బైకిస్ట్‌ను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆ టూవీలర్‌ పెండింగ్‌లో ఉన్న చలానాల లిస్టు చూసి అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమణకు సంబంధించి 77 పెండింగ్‌ చలానాలు ఉన్న ఓ ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు చిక్కింది.

    స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా సోమవారం నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు ఎస్సై రమేష్‌ నేతృత్వంలో ఫీవర్‌ ఆస్పత్రి చౌరస్తా సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో జుజ్జువారపు సువర్ణరాజు  అనే వ్యక్తి తన బుల్లెట్‌ టీఎస్‌ 07ఎఫ్‌హెచ్‌ 1245 నెంబర్ గల వాహనంపై శంకరమఠం నుంచి ఫీవర్‌ ఆస్పత్రి వైపు వెళ్తున్నారు. దీంతో ఆ బండిని ఆపి చెక్ చేశారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ఆ బండి నెంబర్‌తో చెక్‌ చేయగా ఆ వాహనంపై మొత్తం 77 చలానాలు పెండింగ్‌లో ఉండటం చూసి షాక్ తిన్నారు.

    ఆ చలానాలకు సంబంధించి బకాయిలు రూ.12,725 ఉండటంతో ఎస్సై రమేష్‌ ద్విచక్రవానహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని సీఐ రాజేంద్ర కులకర్ణికి తెలియజేయడంతో ఆయన నగర పోలీసు కమిషనరేట్‌కు సమాచారం ఇచ్చారు. పెండింగ్‌ చలానాలు క్లియర్‌ చేస్తే వాహనాన్ని అప్పగిస్తామని ఎస్సై చెప్పారు. కాగా .. పెండింగ్‌ చలానాల్లో ఎక్కువగా హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకే ఉండటం గమనార్హం. ఇంతగా ట్రాఫిక్‌ వాయిలెన్స్‌కు పాల్పడిన సదరు వాహనదారుడికి ఏమైనా శిక్ష విధిస్తారా, లేక లైసెన్స్‌ రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Hyderabad, Hyderabad police, Telangana, TRAFFIC AWARENESS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు