HYDERABAD TRAFFIC POLICE KEEN OBSERVATION ON VEHICLE SPEED IN HYDERABAD SNR
సిటీలో స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్..గంటకు 40కి.మీ వేగం దాటితే భారీ ఫైన్
hyderabad traffic police
hyderabad traffic police: గ్రేటర్‌లోని మెయిన్ రోడ్లపై వేగ నియంత్రణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ కఠినతరం చేశారు. ప్రధాన మార్గాల్లో గంటకు 40కి.మీ వేగం దాటితే 1035 రూపాయలు ఫైన్ వసూలు చేయనున్నారు. ఈ స్పీడ్ డ్రైవింగ్ రూల్ అన్నీ రకాల వాహనాలకు వర్తిస్తుందని హెచ్చరించారు.
వాహనదారులారా జాగ్రత్త. చేతిలో వెహికల్ ఉందని స్పీడు పెంచారో అంతే సంగతులు. మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు ఆపకపోయినా మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేంటని ఆశ్చర్యపోకండి. గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఈ రూల్ అమలవుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైటెక్ సిటీ క్రాస్ రోడ్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్, , జేఎన్టీయు సర్కిల్, ట్యాంక్ బండ్, సుచిత్ర జంక్షన్ రూట్లలో వెహికల్ స్పీడ్ కేవలం గంటకు 40కి.మీ వేగంతో మాత్రమే నడపాలని రూల్ పెట్టారు. దాన్ని ఎవరు క్రాస్ చేసినా ..1035రపాయలు చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. న్యూఇయర్ సెలబ్రేషన్‌కి మాంచి జోష్ మీదున్న వాళ్లకు కళ్లెం వేయడంతో పాటు హైదరాబాద్ ప్రధాన రోడ్లపై వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిని కంట్రోల్ చేసేందుకే ట్రాఫిక్ పోలీసులు ఈ రూల్ అమలు చేస్తున్నారు. ఎంత దూరం వెళ్లినా పర్వాలేదు కానీ..సిటీలోని ప్రధాన రోడ్లపై మాత్రం కేవలం 40కి.మీ స్పీడుకు మించి వాహనం నడిపితే జరిమానాను ఈ చలాన్ల రూపంలో చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
స్పీడ్ డ్రైవింగ్‌పై కొరడా..
సిటీలో స్పీడుగా వాహనాలు నడిపి ట్రాఫిక్ పోలీసుల కంటపడకుండా వెళ్లేందుకు ప్రయత్నించే వాళ్లు గుర్తుంచుకోండి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిటీ జంక్షన్లలో ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ సీసీ కెమెరాలు.. ఇప్పుడు డ్రైవింగ్‌పైనే కన్నేసి ఉంచాయి. పట్టుకోరు కదా..జరిమానా స్పాట్లో వసూలు చేయరులే అని సింపుల్‌గా కొట్టిపారేస్తే.. సీసీ కెమెరాలో రికార్డైన మీ చలాన్లను చిట్టా విప్పుతారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వెంటనే వాటిని లెక్కబెట్టి ఇంత కట్టండి లేకపోతే మీ వెహికల్ సీజ్ చేస్తామని చలాన్లు ఇంటికి పంపుతారు మర్చిపోవద్దు.
న్యూఇయర్‌కి ముందే షాకింగ్ న్యూస్..
మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే బైకులున్న కుర్రాళ్లు, కార్లలో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్న జంటిల్మెన్స్ ఎంజాయ్ మూడ్‌లో సిటీలోనే స్పీడు పెంచారో అంతే సంగతులు. ఒక్కసారి స్పీడ్ లిమిట్ క్రాసైనా..1035రూపాయలు ఫైన్ కట్టాల్సిందే గుర్తుంచుకోండి.
ఈసారి లెక్క వేరు..
గతేడాది కరోనా కారణంగా వేడుకలు, పార్టీలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కొంత తగ్గింది. కానీ అన్‌లాక్ తర్వాత హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లపైనే యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగాయి. ఈసారి కరోనా ఆంక్షలు లేకపోవడం, న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వడంతో నగరవాసులు పార్టీలు, ఎంజాయ్మెంట్ మూడ్‌లో మునిగిపోతున్నారు. కానీ స్పీడ్ కంట్రోల్ కండీషన్ మాత్రం మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.