అవన్నీ పుకార్లే... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వివరణ

సోషల్ మీడియాలో పెండింగ్ చలాన్లకు సంబంధించిన సర్క్యూలేట్ అవుతున్న వార్తల్లో నిజంగా లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: August 27, 2019, 1:08 PM IST
అవన్నీ పుకార్లే... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వివరణ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొత్త వాహన చట్టం ప్రకారం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ట్రాఫిక్ చలాన్లు భారీగా పెరగనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వాహనాలపై ఉన్న జరిమానాలు సెప్టెంబర్ 1 ఒకటో తేదీలోపు చెల్లించకపోతే అవన్నీ కొత్త చట్టం ప్రకారం పెరుగుతాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. దీంతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. కొందరు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ పోలీసులను కోరడంతో... దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వార్తలు నిజం కాదని వివరించారు.
మరోవైపు కొత్త చట్టం ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన జరిమానాలు విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ముందుగానే పలు కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేసిన వాహనదారులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ చలాన్లు భారీగా పెరగడంపై వాహనదారుల్లో ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. వీటిపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరుతున్నారు.


First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>