news18-telugu
Updated: February 15, 2020, 10:55 PM IST
ప్రతీకాత్మకచిత్రం
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో 103మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 43కార్లు, 60 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఐదుగురు యువతులు ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపర్చనున్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా వాహనదారులు మారడంలేదు. తరచూ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
Published by:
Krishna Adithya
First published:
February 15, 2020, 10:55 PM IST