హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపుగా అస్సలు వెళ్లకండి..!

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపుగా అస్సలు వెళ్లకండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మ్యాచ్‌ కోసం 1500 మంది పోలీస్‌ సిబ్బందితో భద్రత, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా నిర్దేశించిన పార్కింగ్‌ స్థలాలు, పోలీసులు సూచించిన ప్రవేశమార్గం, బయటికి వెళ్లే మార్గాల్లోనే ప్రేక్షకులు వెళ్లాలన్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆదివారం హైదరాబాద్ ఉప్పల్‌లో ఐపీఎల్‌ సంబురం మొదలుకానున్నది. క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్‌ మ్యాచ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ (ఏప్రిల్‌2)న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మ్యాచ్‌ జరగనుంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్నీ ఏర్పాట్లు చేసింది. సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. స్టేడియానికి నాలుగు ప్రధాన మార్గాల్లో వెహికిల్స్​ను అనుమతిస్తామన్నారు. అయితే భారీ వాహనాలకు ఉప్పల్ స్డేడియం వైపు అనుమతి లేదని స్పష్టం చేశారు.

మ్యాచ్‌ కోసం 1500 మంది పోలీస్‌ సిబ్బందితో భద్రత, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా నిర్దేశించిన పార్కింగ్‌ స్థలాలు, పోలీసులు సూచించిన ప్రవేశమార్గం, బయటికి వెళ్లే మార్గాల్లోనే ప్రేక్షకులు వెళ్లాలన్నారు. ఉప్పల్ స్డేడియానికి వచ్చే ప్రధాన మార్గాల్లో ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్ హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే భారీ వాహనాలు.. చెంగిచెర్ల చౌరస్తా, చెర్లపల్లి, ఐవోసీఎల్, ఎన్​ఎఫ్​సీ మీదుగా వెళ్లాలని సూచించారు. మల్లాపూర్ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే హెవీ వెహికిల్స్ చెర్లపల్లి, చెంగిచెర్ల మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

మరోవైపు స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్‌ బాటిళ్లు, కెమరాలు, సిగరేట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, లైటర్లు, అగ్గిపెట్టెలు, పదునైన మెటల్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ వస్తువులు, బైనాక్యులర్లు, బ్యాటరీలు, హెల్మెట్లు, బ్యాగులు, తదితర వస్తువులు స్టేడియంలోకి అనుమతించమన్నారు. స్టేడియం లోపలు కూడా భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.

First published:

Tags: Hyderabad, IPL 2023, Local News, Traffic police

ఉత్తమ కథలు