హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్, నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవాల కారణంగా ఫిబ్రవరిలో 2 వారాల పాటు ట్రాఫిక్ మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ రోడ్లు మూసివేతకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 3 నుంచి నగరంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఫార్ములా ఇ రేస్, కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల ఈ నెల 3 నుంచి 17 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక ఫిబ్రవరి 5న ఫార్ములా ఈ రేస్ పనులు పూర్తి చేయడానికి ఎన్టీఆర్ మార్గ్ మూసివేశారు. ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు ఫార్ములా ఈ రేసు జరగనుంది. ఈ సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తారు. ఇక ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రముఖులు, వీవీఐపీల వెళ్లేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు.
ఫార్ములా E కోసం భద్రతా ఏర్పాట్లు
ఫిబ్రవరి 11న హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ట్రాక్‌పై జరగనున్న భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా ఇ రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. హైదరాబాద్ నగర పోలీసులు భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఎల్ ఆటోమొబైల్,, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది సందర్శకులు ఈ ఈవెంటులో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, ఈవెంట్ నిర్వాహకులతో కలిసి 2.8 కి.మీ రేస్ ట్రాక్ ను పరిశీలించారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌లను పరిశీలించారు. నిర్వాహకుల సన్నద్ధత, ఇతర భద్రతా అంశాలను ఆయన సమీక్షించారు. వీక్షకుల భద్రత, ట్రాఫిక్ కోసం 575 మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, మెట్రో సేవలను వినియోగించుకోవాలని ఆనంద్ కోరారు. మొత్తం 16 స్టాండ్‌లు, ఏడు గేట్‌లు, నాలుగు ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపులు
రేస్ ట్రాక్‌పై పెండింగ్‌లో ఉన్న పనులు, ఇతర ఏర్పాట్లను వేగవంతం చేయడానికి ఫిబ్రవరి 5న ఎన్టీఆర్ మార్గ్‌ను మూసివేయనున్నట్లు ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 12 వరకు అమలులో ఉంటాయి.
సచివాలయం ప్రారంభోత్సవం
ఫిబ్రవరి 17న కొత్త సెక్రటేరియట్‌ను ప్రారంభించనున్నారు. ప్రముఖులు, వివిఐపిలు స్వేచ్ఛగా వెళ్లేలా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, కార్మికులు, వస్తు సామగ్రి తరలింపుపై ఎలాంటి ఆంక్షలు ఉండవని నగర పోలీసు చీఫ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.