గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల... ఫ్లైఓవర్ పనులు, రోడ్ల విస్తరణ పనులు, నాలా పనులు ఇలా రకరకాల మరమ్మత్తులు, నిర్మాణలు జరుగుతూనే ఉంటాయి. దీంతో ఎప్పటికప్పుడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, మళ్లించడం, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడం లాంటివి అధికారులు చేస్తుంటారు. అయితే తాజాగా... నగరంలో కొన్ని ప్రాంతాలల్లో మూడనెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. గ్రేటర్ హైదరదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 మంగళవారం నుంచి జూలై 28 వరకు సుమారు 3 నెలలపాలు ట్రాఫిక్ మళ్లించనున్నాట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
నిత్యం రద్దీగా ఉండే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో 90 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మెట్రో స్టేషన్ వద్ద AG కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల నిమిత్తం దాదాపు మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మార్చి 28 వ తేదీ నుంచి జులై 28వ తేదీ వరకు అనగా 3నెలలు అంటే 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అయితే.. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రయాణికులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సహకరించాలని వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad Traffic Police, Local News, Traffic police