హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : మిగిలింది 5 రోజులే.. కమిషనరేట్‌ల పరిధిలో 190 కోట్ల వసూళ్లు... లేదంటే భారీ జరిమానాలు..

Hyderabad : మిగిలింది 5 రోజులే.. కమిషనరేట్‌ల పరిధిలో 190 కోట్ల వసూళ్లు... లేదంటే భారీ జరిమానాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : జంటనగరాల కమీషనరేట్‌ల పరిధిలో ట్రాఫిక్ చాలన్ల వసూళ్లు స్పీడ్ అప్ అయ్యాయి.. ఈ క్రమంలోనే జంటనగరాల పరిధిలో మొత్తం 190 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి..

  రాష్ట్ర ప్రభుత్వం చలాన్ల వసూలుకు తీసుకువచ్చిన సబ్సీడి ఇవ్వడం ద్వారా కోట్ల రూపాయల వసూలు అవుతున్నాయి. గత ఇరవై రోజులుగా ఒక కోటి 85 లక్షల చాలన్లను క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు 190 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కాగా జంటనగరాల్లోని కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 690 కోట్ల రూపాయల విలువైన పెండింగ్ చాలన్లు వసూలు అయినట్టు ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

  పెండింగ్ చాలన్ల కోసం మార్చి ఒకటి నుండి 31వరకు ప్రత్యేక డిస్కౌంట్ ద్వారా వసూలుకు అవకాశం ఇవ్వడంతో వాహనదారులు సైతం పెండింగ్ చాలన్లు క్లియర్ చేసేందుకు క్యూలు కడుతున్నారు.ఇందు కోసం మరో పదిరోజులే అవకాశం ఉండడంతో పోలీసులు సైతం పెండింగ్ చాలన్ల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఓ వైపు జరిమానాలు విధించడంతో పాటు ప్రత్యేక డ్రైవ్‌ల ద్వార చలాన్ల వసూలు చేస్తున్నారు.

  Khammam : పీజీ మరదలిపై అక్క భర్త కన్ను.. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి.. ఆమె ఏం చేసిందంటే..

  అయితే ఎట్టి పరిస్థితుల్లో చాలన్ల గడువు పెంచే అవకాశాలు లేవని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. మిగిలింది మరో అయిదు రోజులే ఉంది కాబట్టి పెండింగ్ చాలన్లు చెల్లించాలని కోరారు.. ఇక గడువు దాటిన తర్వాత కూడా చెల్లించని పక్షంలో భారీగా జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు 690 కోట్ల రూపాయల విలువవ గల జరిమానాలు వసూలు కాగా ఇంకా 1500 కోట్ల రూపాయల విలువైన పెండింగ్ చాలన్లు వసూలు కావాలని తెలిపారు. మొత్తం 60 నుండి 70 శాతం మేర వసూలు అయ్యో అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కాగా ప్రతి రోజు ఏడు నుండి పది లక్షల వరకు పెండింగ్ చాలన్లు క్లియర్ అవుతున్నట్టు ఆయన తెలిపారు. దీంతో మరో అయిదు రోజులు గడువు ఉండడంతో పెద్ద ఎత్తున వసూలు అయ్యో అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, Traffic challan

  ఉత్తమ కథలు