రాష్ట్ర ప్రభుత్వం చలాన్ల వసూలుకు తీసుకువచ్చిన సబ్సీడి ఇవ్వడం ద్వారా కోట్ల రూపాయల వసూలు
అవుతున్నాయి. గత ఇరవై రోజులుగా ఒక కోటి 20 లక్షల చాలన్లను క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. వీటి
ద్వారా ప్రభుత్వానికి సుమారు 113 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కాగా జంటనగరాల్లోని
కమిషనరేట్ పరిధిలో 63 లక్షల చలాన్లు క్లియర్ కాగా వీటి ద్వారా సుమారు 50 కోట్ల రూపాయలు
వసూలు అయ్యాయి. సైబారాబాద్ పరిధిలో 38 లక్షల చాలన్లు చెల్లించగా 45 కోట్ల రూపాయలు వసూలు
అయ్యాయి. ఇక రాచకొండ పరిధిలో అయితే 16 లక్షల చాలన్లు క్లియర్ కాగా 16 కోట్ల రూపాయలు
వసూలు అయ్యాయి.
పెండింగ్ చాలన్ల కోసం మార్చి ఒకటి నుండి 31వరకు ప్రత్యేక డిస్కౌంట్ ద్వారా వసూలుకు అవకాశం
ఇవ్వడంతో వాహనదారులు సైతం పెండింగ్ చాలన్లు క్లియర్ చేసేందుకు క్యూలు కడుతున్నారు.ఇందు
కోసం మరో పదిరోజులే అవకాశం ఉండడంతో పోలీసులు సైతం పెండింగ్ చాలన్ల వసూలుకు ప్రత్యేక డ్రైవ్లు
నిర్వహిస్తున్నారు. ఓ వైపు జరిమానాలు విధించడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ల ద్వార చలాన్ల వసూలు
చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.