హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ramzan: చార్మినార్ వద్ద ముస్లింలకు నమాజ్ టోపీలు, అత్తర్, సుర్మా పంపిణీ చేసిన పోలీసులు

Ramzan: చార్మినార్ వద్ద ముస్లింలకు నమాజ్ టోపీలు, అత్తర్, సుర్మా పంపిణీ చేసిన పోలీసులు

X
రంజాన్

రంజాన్ టోపీలు, అత్తర్ పంపిణీ

Hyderabad: రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ పోలీసులు ముస్లింలకు రంజాన్ టోపీలు, అత్తర్, సుర్మాను పంపిణీ చేశారు. చార్మినార్ వద్ద ఎసిపి ట్రాఫిక్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిపోర్టర్: దస్తగిర్ అహ్మద్

లొకేషన్: హైదరాబాద్

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే.. రంజాన్ మాసం మూడు రోజుల క్రితమే ప్రారంభమైంది.  ఉదయం సాయంత్రం వేళ.. పాతబస్తీలోని చార్మినార్, మక్కా మసీదు వంటి ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటోంది. అందరూ తలకు టోపీ ధరించి.. కళ్లకు సుర్మాపెట్టుకొని.. సంప్రదాయబద్ధంగా ముస్తాబవుతారు. అందరూ కలిసికట్టుగా మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తారు. మళ్లీ సాయంత్రం అందరూ కలిసి ఇఫ్తార్ విందును ఆరగిస్తారు.

రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ పోలీసులు ముస్లింలకు రంజాన్ టోపీలు, అత్తర్, సుర్మాను పంపిణీ చేశారు. చార్మినార్ వద్ద ఎసిపి ట్రాఫిక్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ముస్లింలకు ఆయన ఆయా వస్తువులను పంపిణీ చేశారు. రంజాన్ మాసాన్ని అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని అన్నారు. పండగ నేపథ్యంలో పాతబస్తీలో భద్రతను పెంచామని చెప్పారు.

కాగా,   రంజాన్ మాసంలో ముస్లింలు నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు ఉంటారు. ఉదయం సూర్యోదయానికి ముందు సహరీ చేసి..సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇఫ్తార్‌తో ఉపవాసం లేదా రోజా ముగిస్తారు. రోజంతా కనీసం మంచినీళ్లు కూడా ముట్టరు. మరి ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చాలా కీలకం. ఇఫ్తార్ అంటే ఉపవాసం విరమించేటప్పుడు తీసుకునే ఆహారం చాలా తేలికగాజీర్ణం (Digestion)అయ్యేది తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సహర్ సమయంలో మాంసం, పనీర్, చికెన్, గుడ్లు, గింజలు, ఆలివ్ నూనె, నెయ్యి , పనీర్ ఇవన్నీ తీసుకోవచ్చు. అన్నంతోపాటు, రోటీ, సత్తు రోటీ వంటి వాటిని కూరగాయలతో కలపి తీసుకోవాలి. ఈ పోషకాల మిశ్రమం ఆకలి కాకుండా కాపాడుతుంది. అన్నంతోపాటు, కూరగాయలు, నెయ్యి , తెల్ల అన్నం తినవచ్చు. అన్నంతో ఈ కూరగాయల కలయిక జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా అరికడుతుంది.

ఇక ఇఫ్తార్‌లో ఖర్జూరాలు, పండ్లు ఉపవాసాన్ని విరమించుకోవడానికి చక్కగా సహకరిస్తాయి. నీటిలో బాగా నానబెట్టిన ఎండు ఖర్జూరాలు, పుచ్చకాయలు తినడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుతుంది. అవి త్వరగా జీర్ణమయ్యే ఆహారాల ఇఫ్లార్ లో తీసుకోవాలి. ఉపవాసాన్ని విరమించుకోవడానికి ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌లను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు.

First published:

Tags: Hyderabad, Local News, Ramzan

ఉత్తమ కథలు