HYDERABAD TPCC PRESIDENT REVANTH REDDY TOOK BLESSING BY TOUCHING FARMER FEET AT INDIRAPARK VRY
Revanth reddy : ఇందిరాపార్క్ వేదిక రైతు కాళ్లు మొక్కిన రేవంత్ రెడ్డి.. ఆ రైతు చేసిన పనికి ఫిదా..
indira park
Revanth reddy : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు కాళ్లు మొక్కాడు. ( Congress party kisan sabha ) ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన కిసాన్ సభలో ఓ రైతు పాట పాడడంతో ఆయన కాళ్లకు అభివాదం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఇందిరా పార్క్ వద్ద రెండు రోజులుగా కొనసాగుతున్న రైతు దీక్షలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రైతుల సమస్యలపై నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన 93 ఏళ్ల రాంరెడ్డి అనే రైతు స్వయంగా పాట రాసి వరిదీక్షలో పాడారు. ఈ పాటలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి శాశ్వత పరిష్కారం చూపుతూ పాట పాడారు. దీంతో ఆయన పాటకు వేదిక మీద నేతలు ఫిదా అయ్యారు. (Revanth reddy took Blessing by touching farmer feet ) ఈక్రమంలోనే వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ఎంపీలు కోమటిరెడ్డిలు రాంరెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి రాంరెడ్డి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
కాగా రెండు రోజుల పాటు కొనసాగిన కిసాన సభలో పలు తీర్మాణాలను చేశారు. వాటిలో ముఖ్యంగా ప్రస్తుత ఖరీఫ్‌లో వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగొలు చేసి, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. ( Revanth reddy took Blessing by touching farmer feet ) ధాన్యం కొనుగోలు వ్యవస్థలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదంటూ డిమాండ్ చేశారు. .గతేడాది రబీ పంట సేకరణలో జరిగిన అవకతవకల వల్ల రైతుకు భారీగా జరిగిన ఆర్థిక నష్టాల మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశఆరు.. యాసంగి పంటల సాగు విషయంలో ఆంక్షలు పెట్టకుండా... భూమి స్వభావం, వనరుల అనుకూలతను బట్టి రైతుకు సాగుపై స్వేచ్ఛ ఉండాలని కోరారు... ( Revanth reddy took Blessing by touching farmer feet ) మద్దతు ధరల పరిధిలో ఉన్న ప్రధానమైన పంటలను మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని చెప్పారు... వ్యవసాయ పంటలకు సమగ్ర మద్దతు ధర, కొనుగోలు విషయంలో చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన విత్తన చట్టాన్ని తెచ్చి కల్తీ విత్తనాల బారి నుంచి రైతును కాపాడడంతో పాటు ఒకేసారి రూ. లక్ష పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు... దీంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం 2020, 21 సంవత్సరాలకు కోర్టు ఆదేశాల ప్రకారం పంట నష్ట పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.