టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేవంత్ అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా సర్పంచ్ లకు నిధుల విడుదల, ప్రభుత్వ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ధర్నా చౌక్ కు వెళ్లబోతున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ధర్నాకు వెళ్లకుండానే తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని రేవంత్ పోలీసులను ప్రశ్నించారు. ధర్నా చౌక్ కు వెళ్ళాక అరెస్ట్ చేయాలని రేవంత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
The police storming into our houses like KCR's private army and lifting is a proof of the rowdy state in Telangana which we have fought for with a lot of aspirations. #HitlerKCR pic.twitter.com/7mXTklMMJS
— Revanth Reddy (@revanth_anumula) January 2, 2023
ధర్నా చౌక్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపు..
కాగా సర్పంచ్ లకు నిధుల విడుదల, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీపీసీసీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా చౌక్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ఇందిరాపార్క్ వద్ద జరగాల్సిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ ఎలాగైనా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు తెగేసి చెప్పారు. దీనితో ఈరోజు ఉదయం నుండి కూడా కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు నాయకులను గృహనిర్బంధం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీనితో వెళ్లే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉండిపోయారు. చివరకు ధర్నాకు వెళ్లాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి ఇంటి నుండి బయటకొచ్చి గేటు దూకారు. కానీ అక్కడే ఉన్న పోలీస్ లు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. దీనితో రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సర్పంచ్ ల సమస్యలపై ధర్నాకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసు ప్రయోగంతో హౌస్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కేసీఆర్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రాల్లో,మండల కేంద్రాల్లో రాస్తారోకో, దిష్టిబొమ్మల దగ్ధం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Mp revanthreddy, Revanth Reddy, Telangana