హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: హైదరాబాద్​లో భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్​.. బడ్జెట్​పై టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 

Telangana: హైదరాబాద్​లో భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్​.. బడ్జెట్​పై టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం (CLP) జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు.

  తెలంగాణ (Telangana)లో ఐదుగురు అధికారుల చేతుల్లో 40 శాఖలున్నాయని.. అధికారుల అండతో సీఎం వేల కోట్లు కొల్లగొడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం (CLP) జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..   మనం ఏ పోరాటం చేసినా గృహ నిర్బంధం చేస్తున్నారని.. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో వేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో వేయడానికి కారణమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

  మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ దగ్గర 8 శాఖలు ఉన్నాయని, సుల్తానియా దగ్గర 6 శాఖలు ఉన్నాయని సోమేష్‌ ఆంధ్రకి కేటాయించిన అధికారని ఆయన అన్నారు. మన వాళ్లు కొంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, నేను ఉరికేనే మాట్లాడటం లేదన్నారు. తెలివి తక్కవుగా మాట్లాడడం లేదని, ఒక పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నానన్నారు. అంతేకాకుండా తెలంగాణలో (Telangana) కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  తెలంగాణలో (Telangana) కేసీఆర్ సర్కార్ తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లుగా కేసీఆర్ (kcr) వ్యవహారం వుందని ఆయన ఎద్దేవా చేశారు. గవర్నర్‌ని కూడా బడ్జెట్ సమావేశానికి రాకుండా చేశారని.. గవర్నర్ మాట్లాడకపోతే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరిస్తారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ సంక్షోభమని.. కేసీఆర్ ప్రజల్ని భ్రమల్లో వుంచుతున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశాన్ని బంగారు దేశంగా మార్చుతానని కేసీఆర్ తిరుగుతున్నారని.. ప్రజలు అభివృద్ధి చెందుతారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని భట్టి గుర్తుచేశారు.

  ఇక ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మాట్లాడుతూ..బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విధానం కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. దీనిపై అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంట్ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికల (Telangana elections)పై టీపీసీసీ మాజీ చీఫ్​ స్పందించారు.

  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలకుపైగా ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికైనా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న సంగమేశ్వరం , పోతిరెడ్డిపాడు విస్తరణపై కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడం లేదని ఉత్తమ్‌కుమార్ నిలదీశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Revanth Reddy, Telangana Assembly, Telangana Budget 2022, Telangana Politics

  ఉత్తమ కథలు