సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో దాడులకు పాల్పడిన యువకులతో శుక్రవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC chief Revanth Reddy ) ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీని నమ్మి యువత బీజేపీకి ఓటేశారని అన్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్నిపథ్ (Agnipath) ను తీసుకొచ్చి యువత ఆశలపై నీళ్లు చల్లారని రేవంత్ ఆరోపించారు. యువకులపై నమోదు చేసిన నాన్ బెయిలబుల్, 307 సెక్షన్ల (non-bailable sections )ను వెంటనే ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఏటా ఆర్మీలో 70 వేల మందిని పాత పద్దతిలో రిక్రూట్ మెంట్ చేసే వారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చట్టాలు, శాసనాలను పక్కన పెట్టి అగ్నిపథ్ (Agnipath) ను అమలు చేస్తామంటే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యువతను అడ్డాకూలీలుగా మార్చారని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో యువత జీవితాన్ని ఫణంగా పెట్టొద్దని ఆయన కోరారు. కరోనా వల్ల రెండేళ్లుగా నియామకాల్లేవని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
స్టేషన్లో క్షణికావేశంలో దాడులకు పాల్పడిన వారిపై ఐఎస్ఐ తీవ్రవాదులపై పెట్టిన కేసులు పెట్టారని రేవంత్ ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసుకు సంబంధించి అరెస్టైన వారిలో మెజారిటీ పిల్లల పేరేంట్స్ కు సమాచారం తెలియదన్నారు.
Hundreds of youth have been charged on the pretext of agitating against #AgnipathScheme and sent to prison.
Youth who dreamt about life are now in Chanchalguda Jail, stuck in cases & anxious about their future. We met them at the jail & tried to reassure them.#AgnipathWapasLo pic.twitter.com/NKbBkjgCb9
— Revanth Reddy (@revanth_anumula) June 24, 2022
రెండేళ్లుగా కరోనాతో ఆర్మీలో రిక్రూట్ మెంట్స్ చేయలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు రాత పరీక్షల కోసం లక్షలు చెల్లించి రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. ఆర్మీ అభ్యర్ధులపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం నేపథ్యంలో హత్యాయత్నం సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడాన్ని రేవంత్ ఖండించారు.
కేసులు ఎలా నమోదు చేస్తారు?
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఆర్మీ అభ్యర్ధులపై 307 సెక్షన్ కింద కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా నమోదు చేస్తారన్నారు. ఆర్మీ అభ్యర్ధులపై పెట్టిన 307 తో పాటు నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్.
పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేశ్ మృతదేహం ఉన్న పాడెను మోసి రాజకీయంగా ఈ ఘటనను వాడుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని రేవంత్ ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసులు పెట్టిందన్నారు. మోదీకి కేసీఆర్ కూడా తోడ్పాటు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. కేసులో ఇరుక్కున్న బాధితులందరికీ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం అందిస్తుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Protest, Army jobs, Hyderabad, Revanth Reddy