హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth reddy: చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు: రేవంత్​ రెడ్డి

Revanth reddy: చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు: రేవంత్​ రెడ్డి

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన హైదరాబాద్ స్వాతంత్య్ర వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొందరు తెలంగాణ చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కొందరు తెలంగాణ చరిత్రను ( History of Telangana) వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఆయన వ్యాఖ్యానించారు.  శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన హైదరాబాద్ స్వాతంత్య్ర వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆయన ఆవిష్కరించారు. పల్లెదనం, అమ్మలోని కమ్మదనం కలగలిసిన రూపం మన తెలంగాణ తల్లి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్‌ (TS)ను టీజీ (TG) చేస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎగరే విధంగా జెండా రూపొందిస్తామని తెలిపారు.

  జునాఘడ్‌లో వేడుకలు ఎందుకు జరపట్లేదు..

  రేవంత్​ మాట్లాడుతూ..  “ నిజాం  (Nizam) పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పోరాడింది. ఇవాళ కొందరు చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తెలంగాణ అంటేనే కాంగ్రెస్ . కమ్యూనిస్టులతో కలిసి భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేశారు. చరిత్రను నేడు కొందరు వక్రీకరిస్తున్నారు. ఆనాడు 563 సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారు. గుజరాత్‌లోని (Gujarat) జునాఘడ్‌లో వేడుకలు ఎందుకు జరపట్లేదు. హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు. నెహ్రూ ఆదేశాల మేరకే పటేల్ హైదరాబాద్‌ను విలీనం చేశారు. స్వాతంత్ర్య, సాయుధ పోరాట సమయానికి భాజపా అసలు పుట్టలేదు.'  అన్నారు.

  బీజేపీ చిల్లర వేషాలు..

  తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించి ఇక్కడి పరిశ్రమలు గుజరాత్ తరలిపోవాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎనిమిది ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ వేడుకలను ఎందుకు చేయలేదన్నారు. ఎంఐఎంను భూతంగా చూపి తెలంగాణ అక్రమించడానికి బీజేపీ చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. 1950లో గాంధీభవన్ కు పునాది వేసిందే సర్ధార్ వల్లాభాయ్ పటేల్ అని..అటువంటి నేతకు నివాళులు అర్పించడానికి బీజేపీ ఏం నైతిక హక్కు ఉందని ప్రశ్నించారు. అమిత్ షా సభకు 1500 మంది కూడా రాలేదని అన్నారు. చరిత్రలో బీజేపీ లేదు కాబట్టే ప్రజలు వారి సభకు రాలేదని అన్నారు.

  దండ వేసే హక్కు కూడా లేదు..

  1950లో గాంధీ భవన్​కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పునాదులు వేశారని రేవంత్​ గుర్తుచేశారు. పటేల్​కు పూలదండ వేసే నైతిక హక్కు కూడా భాజపాకు లేదని రేవంత్​ విమర్శించారు.  ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17 ఉత్సవాలు చేయని కేసీఆఱ్​ నేతృత్వంలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వంకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని రేవంత్​ ప్రశ్నించారు. బైరాన్​పల్లి ఘటనలు తెలంగాణలో చాలా జరిగాయని రేవంత్​ వ్యాఖ్యానించారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం దండు కట్టిండ్రు.. దళంగా కదిలిండ్రు అని గుర్తుచేశారు  రేవంత్​. దేశం, రాష్ట్రానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది.. కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ వ్యాఖ్యానించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Revanth Reddy, September 17

  ఉత్తమ కథలు