హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: వారికి ఇక టికెట్లు ఇచ్చేది లేదు.. కాంగ్రెస్​ ఎమ్మెల్యే టికెట్లపై కుండబద్దలు కొట్టిన టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి

Telangana: వారికి ఇక టికెట్లు ఇచ్చేది లేదు.. కాంగ్రెస్​ ఎమ్మెల్యే టికెట్లపై కుండబద్దలు కొట్టిన టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్​ తరఫున అందరికీ టికెట్లు ఇచ్చేది లేదని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ కుండబద్దలు కొట్టారు. ఎలాంటి వారికి టికెట్లు ఇస్తారో కూడా తేల్చిచెప్పారు.

  టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి (TPCC Chief Revanth reddy) మొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్​ తరఫున అందరికీ టికెట్లు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. ఎలాంటి వారికి టికెట్లు ఇస్తారో కూడా తేల్చిచెప్పారు. ఆదివారం నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు తదితర డిమాండ్లతో దీక్ష చేపట్టి యూత్ కాంగ్రెస్ (Youth congress) అధ్యక్షుడు శివసేన రెడ్డి దీక్షను రేవంత్ రెడ్డి విరమింపజేశారు.  ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నేతలకు పార్టీలో సముచితం స్థానం ఉంటుందని, వారికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడున్న ఎంతోమంది నేతలు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినవారేనని రేవంత్ అన్నారు యూత్ కాంగ్రెస్ నేతగా వున్న చిన్నారెడ్డి రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో వనపర్తి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. యూత్ కాంగ్రెస్‌లో కొట్లాడినోళ్లు అందరికీ టికెట్లు (Tickets) వస్తాయని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పన్నెండు నెలల్లో సోనియా గాంధీ రాజ్యం వస్తుందని.. కొట్లాడినోడికే బీ ఫామ్ (B Form) ఇస్తామని, ఈసారి కోటాలు వాటాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. తాను పన్నెండు ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని.. కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు 12 నెలల సమయమిస్తే.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

  తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్సే..

  తెలంగాణ (Telangana)కు పట్టిన చీడపీడ కేసీఆర్‌ను పొలిమేరల వరకు తరిమేయాలని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. మనకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ ఉద్యోగాన్ని పీకేసే శక్తి మీకుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం తొలుత పోరాడింది కాంగ్రెస్ నేతలేనన్న రేవంత్​ అన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్  వచ్చిందన్నారు. ప్రజలకు ఎలాంటివి మేలు చేస్తాయో ఆ నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ తీసుకుందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

  దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ (Telangana) ఉద్యమాన్ని మొదలుపెట్టలేదంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఏపీలో కాంగ్రెస్​ పార్టీని చంపుకుని సోనియా గాంధీ తెలంగాణ (Telangana)ను ఇచ్చారని రేవంత్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వుంటే.. ప్రజల ఆకాంక్షలు నెరవేరేవని రేవంత్​ అభిప్రాయం వ్యక్తం చేశారు.


  కోతుల గుంపుకు అప్పగించినట్లుంది..

  కొత్తగా వచ్చిన తెలంగాణ (Telangana) ను కోతుల గుంపుకు అప్పగించినట్లయ్యిందని రేవంత్ ఆరోపించారు. తనకు టీపీసీసీ చీఫ్ పదవి కన్నా.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవే ఎక్కువ ఇష్టమన్నారు. కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్‌లో  పదవి ఇచ్చింది వీ హనుమంతరావేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడినై వుంటే కేసీఆర్‌కు నిద్రలేకుండా చేసేవాడినని అన్నారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత ప్రాణాలు తీస్తోందని రేవంత్ ఆరోపించారు. అధికారంలోకి వస్తే లక్షా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ (Telangana)లో అమరవీరుల కుటుంబాలకు పదవులు రాలేదని.. నిరుద్యోగులకూ రాలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Congress, Hyderabad, Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు