సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి కస్తూర్భా కళాశాలలో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీలోని ప్రయోగశాలలో ప్రమాదంతో విషవాయువు లీక్ అయినట్లు తెలుస్తుంది. దీని కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కాగా వారిని అధికారులు హుటాహుటిన గాంధీ హాస్పిటల్ తో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. కాగా అస్వస్థతకు గురవుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
సైన్స్ ల్యాబ్ లో విషవాయువు లీక్..
కాగా కస్తూర్భా కళాశాలలో ఇంటర్ బ్లాక్ లోని కెమిస్ట్రీ ల్యాబ్ లో విషవాయువు లీక్ అయినట్లు తెలుస్తుంది. విద్యార్థులు ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తున్న క్రమంలో విషవాయువులు లీక్ అయ్యాయి. దీనితో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సుల సహాయంతో వారిని గాంధీ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విష వాయువు ప్రభావంతో అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
Gas leakage in the Kasturbha Gandhi school at Maredpall 10 students fell sick & shifted to nearby hospital#Telangana#Hyderabad .@TelanganaCMO .@KTRTRSpic.twitter.com/YYTRfBCpoM — Sagar KV ???? (@SagarVanaparthi) November 18, 2022
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..
కస్తూర్భా కళాశాలలో విషవాయువు లీక్ కలకలం విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటీన ఆసుపత్రికి పరుగులు తీశారు. తమ పిల్లలకు ఏమైంది. ఎలా ఉన్నారని పాఠశాలకు వచ్చారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పోలీసులు, కాలేజీ యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఏదేమైనా కాలేజీలో విషవాయువు లీక్ ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Secunderabad, Telangana