Home /News /telangana /

HYDERABAD TONY SHOCKED THE POLICE IN THE HYDERABAD DRUGS CASE THAT HE HAS BEEN DELETING DATA FROM HIS MOBILE PHONES FROM TIME TO TIME PRV

Drugs case in Hyderabad: డ్రగ్స్​ కేసులో పోలీసులకు షాక్​ ఇచ్చిన నిందితుడు టోనీ.. అతని ఫోన్లలో డేటా రికవరీకి ఆన్​ చేసి చూస్తే..

 డ్రగ్ పెడ్లర్ టోని

డ్రగ్ పెడ్లర్ టోని

హైదరాబాద్​ సహా ఇతర నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ టోని సహా ఏడుగురు వ్యాపారవేత్తలను హైద్రాబాద్ పోలీసులు ఈ నెల 20వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టోనీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది.

    హైదరాబాద్​ సహా ఇతర నగరాలకు డ్రగ్స్ (Drugs) సరఫరా చేస్తున్న నైజీరియన్ టోని (Tony) సహా ఏడుగురు వ్యాపారవేత్తలను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఈ నెల 20వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. డ్రగ్స్ కేసులో విచారణ సమయంలో హవాలా, మనీలాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్, హవాలాను నిగ్గు తేల్చాలని ఈడీకి హైదరాబాద్ పోలీసులు ఈ నెల 24న లేఖ రాశారు. తాజాగా టోనీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. టోని నుంచి రెండు మొబైల్​ ఫోన్లు (Mobile phones) పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులకు ఆధారాలు దొరకకుండా టోని జాగ్రత్తలు తీసుకొన్నారని పోలీసులు గుర్తించారు. వాట్సాప్​, ఫేస్‌టైమ్ డేటాను టోని ఎప్పటికప్పుడు డిలీట్ చేసినట్టుగా (Deleting data time to time)  పోలీసులు గుర్తించారు. టోని ఉపయోగించిన సెల్‌ఫోన్లలో ఆధారాల కోసం పోలీసులు చర్యలు తీసుకొన్నారు.

    టోనీ ఫోన్లలో కాంటాక్ట్​ల సేకరరణ..

    టోనీ ఉపయోగించిన రెండు సెల్ ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ (Forensic lab) కు పంపారు. ఆ సెల్ ఫోన్లలోని కాంటాక్ట్స్ లిస్టును పోలీసులు రిట్రీవ్ చేసినట్లు సమాచారం. ఈ డేటాతో డ్రగ్స్ (Drugs)​ తీసుకొన్న వ్యాపారుల లిస్టును పోలీసులు బయటకు తీస్తున్నారు. రెండు రోజులుగా హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) టోనిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.పోలీసుల కస్టడీలో టోని నోరు విప్పడం లేదని తెలిసింది.

    టోని (Tony) అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్ ను గతంలోనే అరెస్ట్ చేశారు. దీంతో Tony జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇమ్రాన్ తో చేసిన చాటింగ్ ను టోని డిలీట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. 2013లో నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చిన టోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ వివరించారు.ముంబైలోని ఈస్ట్ అంథేరిలో టోని నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు.

    బడా పారిశ్రామికవేత్తలు..

    ఈ డ్రగ్స్‌ కేసులో  15 మంది వ్యాపారవేత్తలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను (Businessman) అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు వ్యాపారులు గజేంద్ర, విపుల్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్న గజేంద్ర, విపుల్‌లు టోనీ అనే వ్యక్తి దగ్గర్నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్‌ (Drugs) తీసుకుంటున్నారు. హైదరాబాద్​లో రూ.​ 500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు.. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు (Police) గుర్తించారు. గుర్తించిన 15 మంది వ్యాపారవేత్తల వద్ద వివరాలను సేకరిస్తున్నారు. వీరంతా రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Drugs case, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు