హోమ్ /వార్తలు /telangana /

TDP Meeting: రేపు హైదరాబాద్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. భారీగా చేరికలకు ప్లాన్

TDP Meeting: రేపు హైదరాబాద్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. భారీగా చేరికలకు ప్లాన్

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

TDP Meeting: తెలుగు దేశం పార్టీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏపీలో వచ్చిన ఉత్సాహాన్ని తెలంగాణలోనూ కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రేపు పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయీలు తీసుకోనున్నారు. ఇంతకీ టీడీపీ ప్లాన్ ఏంటంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TDP Meeting: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తెలుగ దేశం పార్టీ (Telugu Desam Party)లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) పార్టీలో నూతనోతేజాన్ని నింపాయి. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అదే ఊపుతో తెలంగాణ (Telangana)లోనూ పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టిసారించింది. ఏం చేయాలి అన్నదానిపై ప్లాన్ యాక్షన్ రెడీ చేయనున్నారు. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్ (Hyderabad) లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వడమే లక్ష్యంగా చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనుంది టీడీపీ.

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా పోరాటాలు, సంస్థాగత పటిష్టతపై కార్యాచరణ సిద్దం చేయనుంది టీడీపీ . తెలంగాణ ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోనుంది టీడీపీ. చాలా కాలం తరువాత హైదరాబాదులో పొలిట్ బ్యూరో మీటింగ్ జరగనుండడంతో ఏం చర్చిస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది.

ముఖ్యంగా ఈ సమావేశం టీడీపీకి చాలా కీలకం కానుంది. ఎందుకంటే నాలుగేళ్ల తరువాత టీడీపీకి విజయాలు దక్కాయి. గెలుపు కోసం మొహం వాచిపోయిన సైకిల్ పార్టీకి.. తాజా విజయాలు బూస్టర్ డోస్ లా మారాయి. ఆ ఉత్సాన్ని రెండు రాష్ట్రాల్లో కొనసాగించే విధంగా నిర్ణయాలు తీసుకోనుంది పాలిట్ బ్యూరో సమావేశం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ – తీర్మానాలు వుంటాయి.

ఇదీ చదవండి : ఉండవల్లి కాదు ఊసరవెల్లి.. రిటర్న్ గిఫ్ట్ కు కౌంటర్ గా మంత్రి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాదులో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో జరిగే సభకు రెండు రాష్టాల నుంచి టీడీపీ నేతలు భారీగా హాజరు కానున్నారు. అలాగే ఏపీ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్టీ ఆవిర్భావ సభకు వెళ్లనున్నారు.  ఈ సభలోనే భారీగా చేరికలకు ప్లాన్ చేస్తున్నారు..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, TDP

ఉత్తమ కథలు