HYDERABAD TOLLYWOOD CELEBRITIES WARM WELCOME TO TESLA COMPANY CEO ELON MUSK TO HYDERABAD AFTER THAT MINISTER KTR TWEET TO ELON PRV
Tesla in Hyderabad: ఎలన్ మస్క్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్న టాలీవుడ్ సెలెబ్రెటీస్.. కేటీఆర్ ట్వీట్‌తో కదిలిన సినీ రంగం
టాలీవుడ్ సెలబ్రెటీస్ (ఫైల్)
మస్క్, కేటీఆర్‌ల ట్వీట్లు దేశవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించాయి. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, నటులు స్పందించారు. కేటీఆర్ ఆలోచనకు మద్దతు పలికారు. హైదరాబాద్‌కు రావాలని ఎలన్‌ను ఆహ్వానించారు.
బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon musk) కంపెనీ Teslaతన పూర్తి యాజమాన్యంలోని షోరూమ్‌లను దేశంలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టుంది. ఈ సింగిల్ బ్రాండ్ షోరూమ్‌లను తెరవడానికి నియమాలు , నిబంధనలకు సంబంధించి కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ కంపెనీ తన సింగిల్ బ్రాండ్ షోరూమ్‌ని దేశంలో ప్రారంభిస్తే, అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలకు లోబడి ఉండాలి. బిజినెస్ స్టాండర్డ్ వార్తల ప్రకారం, ఈ దుకాణాలను తెరవడానికి, కంపెనీ స్థానిక కొనుగోలు నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇండియాలోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో ఎదురువుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాకు టెస్లా (Tesla entry in India) రాక ఆలస్యమవుతోందని మస్క్ ట్విట్టర్ (Twitter) లో ఆరోపించారు.
భారత ప్రభుత్వానికి (Indian Government) వ్యతిరేకంగా ఎలన్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ (Telangana IT Minster KTR) టెస్లా అధినేత వ్యాఖ్యలపై స్పందించారు. ముందుగా భారత్ లో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఆ తర్వాత తెలంగాణ/ ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి బోలెడు (Number of chances for Industries) అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందన్నారు. మస్క్, కేటీఆర్‌ల ట్వీట్లు దేశవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించాయి. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, నటులు స్పందించారు. కేటీఆర్ ఆలోచనకు మద్దతు పలికారు.
మస్క్.. హైదరాబాద్ రండి..
‘ఎలాన్ మస్క్.. హైదరాబాద్ రండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా ఉంది. చరిత్ర సృష్టిస్తారు’అని నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ట్వీట్ చేశారు.
‘ఈ కారు చాలా ఇష్టం.. ఆశలు చిగురించినట్లు అనిపిస్తోంది’అని నటి జెనీలియా దేశ్‌ముఖ్ (Genelia Deshmukh) తెలిపారు. టెస్లాను రాష్ట్రానికి స్వాగతిస్తూ టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ (Mehar ramesh) ట్వీట్ చేశారు. ‘ఎలాన్ మస్క్ సార్.. మీరు తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే మంచి మంత్రి కేటీఆర్ ఉన్నారు’’అని ఆయన ఆహ్వానించారు.
టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని.. ‘‘ప్రియమైన ఎలాన్ మస్క్, తెలంగాణలో టెస్లా పరిశ్రమ ఉండాలనుకుంటున్నాం. అవసరమైన మౌలిక సదుపాయాలు, భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార కేంద్రం ఉంది’’అని వ్యాఖ్యానించారు. అలాగే టాలీవుడ్ మరో హీరో నిఖిల్ కూడా టెస్లా (Tesla)ను హైదరాబాద్‌కు తీసుకురావాల్సిందిగా ట్వీట్ చేశారు.
జర్నలిస్టు అమీన్ అలీ, గో న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ పంకజ్ పంచౌరి, సీనియర్ ఎడిటర్ విక్రమ్‌చంద్ర, జర్నలిస్టు ఉమా సుధీర్, నటుడు నిఖిల్ సిద్ధార్థ తదితరులు ట్వీట్ చేస్తూ టెస్లా పరిశ్రమల స్థాపనకు తెలంగాణ గమ్యస్థానంగా నిలుస్తుందని, బెంగళూరును అధిగమించి తెలంగాణ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.