హోమ్ /వార్తలు /telangana /

Krishnam Raju: Tollywood: ప్రభాస్ ఇంట్లో విషాదం .. సినీ నటుడు కృష్ణంరాజు కన్నుమూత

Krishnam Raju: Tollywood: ప్రభాస్ ఇంట్లో విషాదం .. సినీ నటుడు కృష్ణంరాజు కన్నుమూత

krihsnam raju(file photo))

krihsnam raju(file photo))

Krishnam Raju:ప్రముఖ నటుడు, నిర్మాత, నాటి తరం హీరో కృష్ణంరాజు కన్నుమూశారు. రెబల్ స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు ఇక లేరు..హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ నటుడు, నిర్మాత, నాటి తరం హీరో కృష్ణంరాజు (Krishnam Raju) కన్నుమూశారు. రెబల్ స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు ఇక లేరు..హైదరాబాద్ లో ఆదివారం(Sunday) తెల్లవారుజామున 3.25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెబల్ స్టార్ వయస్సు 83 సంవత్సరాలు. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. సోమవారం(Monday)ఉదయం హైదరాబాద్ (Hyderabad)లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్ట్రీ(Jonnalagadda Sri Ramachandra Shastri)అన్నారు. హీరో ప్రభాస్‌ కూడా కృష్ణంరాజు సోదరుడి కుమారుడే అనే విషయం అందరికి తెలిసినదే. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు చివరి సారిగా నటించిన సినిమా కూడా ప్రభాస్‌ రాధేశ్యామ్‌ కావడం విశేషం.

Krishanam Raju Passed Away: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.. ఆయన నట జీవితంలో కీలక మలుపులు ఇవే..

విలక్షణ నటుడు ఇకలేరు..

గత ఐదు దశాబ్ధాలకుపైగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి , మెప్పించారు కృష్ణంరాజు. 83సంవత్సరాల వయసు కలిగిన ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన్ని వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజు మరణవార్తతో తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన లేరన్న వార్త తెలిసి పలువురు సినీ తారలు, స్టార్ హీరోలు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రెబల్‌ స్టార్‌ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సినీ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక ముద్ర..

తాను నటుడిగా కొనసాగుతూనే సోదరుడి కుమారుడు ప్రభాస్‌ను ఈశ్వర్‌ సినిమాతో నట వారసుడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణంరాజు. ప్రభాస్ సైతం అతి తక్కువ కాలంలోనే పెద్దనాన్ని కృష్ణంరాజు తరహాలోనే విలక్షణ నటనతో యంగ్ రెబల్ స్టార్‌గా పేరు సంపాధించుకున్నారు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు చివరి సారిగా నటించిన సినిమా కూడా ప్రభాస్ యాక్ట్ చేసిన రాధేశ్యామ్‌ కావడం విశేషంగా చెప్పుకోవాలి. రాజకీయాల్లో కూడా కీలక పదవులు చేపట్టారు కృష్ణంరాజు.

Published by:Siva Nanduri
First published:

Tags: Krishnam Raju, Tollywood actor

ఉత్తమ కథలు