హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. భారీగా పోలీసుల బందోబస్తు..!

Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. భారీగా పోలీసుల బందోబస్తు..!

శోభాయాత్ర (ఫైల్ ఫోటో)

శోభాయాత్ర (ఫైల్ ఫోటో)

మరోవైపు శోభాయాత్ర కారణంగా ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులు తమ కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా.. సీతారామ ఆలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా రామ నవమి శోభ యాత్ర ప్రారంభమైంది. దీంతో ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 1,500 మంది పోలీసులను శోభాయాత్రకోసం బందోబస్తును ఏర్పాటు చేశారు. ఊరేగింపు గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంభాగ్ ఆలయం నుండి ప్రారంభమై, అదే రోజు రాత్రి 7 గంటలకు కోటిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఊరేగింపును పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రదేశాలలో, పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిఘా డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపును పర్యవేక్షిస్తుంది. అదనంగా, IT సెల్ సోషల్ మీడియా బృందం, స్మాష్ బృందం శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచుతుంది.

ఇదిలా ఉండగా, ఊరేగింపుకు ముందు, సిద్దిఅంబర్ బజార్ మసీదు , దర్గాను కనిపించకుండా తెల్లని బట్టతో కప్పేశారు. మరోవైపు శోభాయాత్ర కారణంగా ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులు తమ కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ , అతని అనుచరుల కదలికలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేసి బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఇదే తొలి ఊరేగింపు కావడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ప్రస్తుత ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించనున్న శ్రీరామనవమి శోభాయాత్రను గ్రాండ్‌గా విజయవంతం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.

First published:

Tags: Hyderabad, Local News, Sri Rama Navami 2023

ఉత్తమ కథలు