గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి వెంబడించి కత్తులు, కటార్లతో పొడిచి చంపారు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు. రోడ్డుపై వెళ్తున్న జనం చూస్తుండగానే ఈ లైవ్ మర్డర్(Live Murder) జరిగింది. ఈ మర్డర్ పురానాపూల్(Puranapool)సమీపంలోని జియాగూడ బైపాస్ రోడ్డు (Jiyaguda Bypass road)దగ్గర చోటుచేసుకుంది. దుండగుల చేతిలో హతమైన వ్యక్తి కోఠి ఇస్లామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్(Jangam Sainath)గా పోలీసులు గుర్తించారు. హత్య చేసి పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన జరిగిన పరిసరాల్లోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.
నడిరోడ్డుపై రక్తచరిత్ర..
నడి రోడ్డుపై ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు సినిమా స్టైల్లో పరిగెత్తించుకుంటూ కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికి చంపిన సంఘటన హైదరాబాద్ జియాగూడ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డుపై జనం చూస్తుండానే ముగ్గురు సాయినాథ్ అనే వ్యక్తిని చుట్టుముట్టి నరికి చంపారు. రోడ్డుపై వెళ్తున్న వారిలో ఒకరు ఈ లైవ్ మర్డర్ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కుల్పుంపూర పోలీసులు మర్డర్ జరిగిన స్పాట్‌కు చేరుకున్నారు. మృతుడు కోఠిలోని ఇస్లామియా బజార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
సినీ ఫక్కీలో మర్డర్ ..
పట్టపగలు ఓ వ్యక్తిని నరికి చంపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు ఘటన స్తలాన్ని పరిశీలించారు. మృతుడ్ని ఎందుకు చంపారు..? ఎవరు చంపారనే ? విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత దుండగులు మూసీ నదిలోకి దూకి పారిపోయినట్లుగా స్థానికులు పోలీసులకు తెలియజేశారు. అక్కడే ఓ వ్యక్తి తీసిన వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.